AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohammed Shami: రంజాన్ మాసంలో హోలీ ఆడతావా? మహ్మద్ షమీ కూతురిపై ముస్లిం మత పెద్ద ఆగ్రహం

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ కూతురు ఐరా ఇటీవల హోలీ వేడుకల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనిపై ప్రముఖ మత గురువు, ఆల్‌ ఇండియా ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్‌ రజ్వీ బరేల్వీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

Mohammed Shami: రంజాన్ మాసంలో హోలీ ఆడతావా? మహ్మద్ షమీ కూతురిపై ముస్లిం మత పెద్ద ఆగ్రహం
Mohammed Shami
Basha Shek
|

Updated on: Mar 17, 2025 | 8:51 AM

Share

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీపై ప్రముఖ మత గురువు, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఇటీవల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్‌ తాగడాన్ని మౌలానా షాబుద్దీన్ రజ్వీ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నెల 6న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో షమీ కూల్‌డ్రింక్‌ తాగుతూ కనిపించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన షరియత్‌ నియమాలను పాటించాలని సూచించారు. అంతేకాదు షరియత్‌ దృష్టిలో షమీ నేరస్థుడని రజ్వీ ఘాటు విమర్శలు చేశారు. ఇస్లాంలో ఉపవాసం తప్పనిసరని.. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఉపవాసం ఉండకపోతే ఇస్లామిక్ చట్టం ప్రకారం అతన్ని పాపిగా పరిగస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై క్రికెట్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. దేశం కోసం క్రికెట్ ఆడుతుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని మౌలానా షాబుద్దీన్ రజ్వీకి సూచించారు. ఈ సంగతి మర్చిపోకముందే తాజాగా మరోసారి షమీని టార్గెట్ చేశాడీ ప్రముఖ మత గురువు. షమీ కూతురు ఐరా హోలీ ఆడడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

పవిత్ర రంజాన్ మాసంలో ఐరా హోలీ ఆడటాన్ని మౌలానా తీవ్రంగా తప్పుబట్టాడు. ఐరాను రంగులు పూసుకునేందుకు అనుమతించిన తల్లి హసీన్‌ జహాన్ పై కూడా మౌల్వీ మండిపడ్డారు. ‘ఐరా లాంటి చిన్నారి రంజాన్‌ మాసం ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు. రంజాన్‌ విశిష్టత తెలియకుండా ఆ చిన్నారి హెలీ ఆడి ఉంటే అది నేరం కాదు. అయితే ఐరా రంజాన్‌ పవిత్రత తెలిసి కూడా హోలీ ఆడి ఉంటే మాత్రం అది ఇస్లాంకు వ్యతిరేకం’ అంటూ ఓ వీడియో సందేశాన్ని పంపాడు మౌల్వీ.

ఇవి కూడా చదవండి

 మహ్మద్ షమీ కూతురు బర్త్ డే ఫొటోస్..

 ఇంత రాద్దాంతం చేయాలా?

కాగా చిన్నారి ఐరా విషయంలో మౌలానా షాబుద్దీన్ రజ్వీ స్పందించిన తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. చిన్నారి సరదాగా రంగులు పూసుకుంటే ఇంత ఇష్యూ చేయాలా అని మతగురువుపై మండిపడుతున్నారు. ఇందులో ఐరా తప్పు లేదంటున్నారు. అదే సమయంలో రంజాన్‌ మాసం అని తెలిసి కూడా ఆమె తల్లి హోలీ ఆడేందుకు అనుమతించడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. మరి దీనిపై ఐరా తల్లి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్
2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్