Indigo Flight: ఇండిగో విమానంలో స్మోకింగ్‌.. ఫ్లైట్‌ గాల్లో ఉండగా వాష్‌రూమ్‌లో సిగరెట్‌ తాగిన ప్రయాణికుడు..

గత మార్చి నెలలో కోల్‌కతా నుండి బయలుదేరిన ఇండిగో విమానంలో పొగ తాగుతూ పట్టుబడిన ప్రయాణికుడిని బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. విమానంలో ఉన్న క్యాబిన్ సిబ్బంది డస్ట్‌బిన్‌లో సిగరెట్‌ను గుర్తించి, వెంటనే నీళ్లతో దాన్ని ఆర్పివేశారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడేలా..ఎయిర్‌లైన్స్‌ భద్రతకు హాని కలిగించినందుకు ఆమెను పోలీసులకు అప్పగించారు. తర్వాత ఆమెపై కేసు నమోదు చేశారు.

Indigo Flight: ఇండిగో విమానంలో స్మోకింగ్‌.. ఫ్లైట్‌ గాల్లో ఉండగా వాష్‌రూమ్‌లో సిగరెట్‌ తాగిన ప్రయాణికుడు..
Indigo Flight
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2023 | 6:04 PM

విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఓ ప్రయాణికుడు చేసిన పనికి అందరూ భయంతో వణికిపోయారు.. అతడు వాష్‌రూమ్‌కు వెళ్లి సిగరెట్‌ తాగేందుకు ప్రయాణించగా అడ్డుకున్న విమానాశ్రయ భద్రత అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందికి అప్పగించారు. సువం శుక్లా అనే ప్రయాణికుడు దుబాయ్ నుండి కోల్‌కతాకు ప్రయాణిస్తున్నప్పుడు విమాన నిబంధనలను ఉల్లంఘించి విమానం వాష్‌రూమ్‌లో పొగ తాగాడు . ఘటనను గమనించిన విమాన సిబ్బంది వెంటనే పైలట్‌కు సమాచారం అందించి ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి అప్పగించారు. శనివారం ఉదయం దుబాయ్ నుండి కోల్‌కతాకు వెళ్తున్న ఇండిగో విమానంలో విమాన నిబంధనలను ఉల్లంఘించినందుకు సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దుబాయ్‌ నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానం వాష్‌రూమ్‌లో పొగ తాగాడన్న ఆరోపణలపై కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు సువం శుక్లా వాష్‌రూమ్‌లోకి ప్రవేశించి అక్కడ పొగ తాగడం ప్రారంభించాడని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. అనంతరం నిందితుడైన ప్రయాణికుడిని సీఐఎస్‌ఎఫ్ అధికారులు విచారించారు. విమానంలో ఉన్నప్పుడు ఇటువంటి చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడినందుకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిని భిదాన్‌నగర్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, ఇంకా పలు సెక్షన్ల కింద అరెస్టు చేశారు.

క్యాబిన్ సిబ్బంది, సహ-ప్రయాణికుడు కూడా దానిని గమనించి, విమానం ల్యాండ్ అయిన వెంటనే పైలట్‌కు సమాచారం అందించారు. ఫ్లైట్ అధికారి వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందిని సంప్రదించారు. విమానంలో ధూమపానం పూర్తిగా నిషేధించబడింది. ప్రయాణీకుల భద్రత కోసం ఈ నియమాలు అమలు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ధూమపానాన్ని ప్రయాణికులు, సిబ్బంది గమనించి విమానంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడారు. లేకుంటే పెను ప్రమాదం జరిగేదని ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గతంలో కూడా ఇండిగో విమానంలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. గత మార్చి నెలలో కోల్‌కతా నుండి బయలుదేరిన ఇండిగో విమానంలో పొగ తాగుతూ పట్టుబడిన ప్రయాణికుడిని బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. విమానంలో ఉన్న క్యాబిన్ సిబ్బంది డస్ట్‌బిన్‌లో సిగరెట్‌ను గుర్తించి, వెంటనే నీళ్లతో దాన్ని ఆర్పివేశారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడేలా..ఎయిర్‌లైన్స్‌ భద్రతకు హాని కలిగించినందుకు ఆమెను పోలీసులకు అప్పగించారు. తర్వాత ఆమెపై కేసు నమోదు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!