లోకల్‌ ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య ముష్టి యుద్ధం.. ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..

లోకల్‌ రైల్లో జరిగిన ఈ ఘటనకు సంబందించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోను చాలా మంది చూశారు. వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు, ట్విట్లు చేశారు. కొందరు నెటిజన్లు.. ఆ ఇద్దరు ప్రయాణికుల మధ్యలో దూరి వారి గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అభినందిస్తున్నారు. ఇక రైల్లో ఉన్న మరికొంతమంది ప్రయాణీకులు ఈ ఫైటింగ్ సీన్‌ని రిఫ్రీగా ఎంజాయ్‌ చేస్తున్నారంటూ విమర్శించారు.

లోకల్‌ ట్రైన్‌లో ఇద్దరు ప్రయాణికుల మధ్య ముష్టి యుద్ధం.. ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..
Local Train
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2023 | 4:23 PM

ముంబై లోకల్ ట్రైన్‌, ఢిల్లీ మెట్రో ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తున్నాయి. వివిధ కారణాల వల్ల ప్రయాణికుల మధ్య ఘర్షణలు, వింత వింత చేష్టలకు హాట్‌స్పాట్‌గా మారుతున్నాయి. ఢిల్లీ మెట్రో, ముంబై లోకల్‌ ట్రైన్‌లో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రయాణికుల మధ్య ఘర్షణ, ముష్టి యుద్ధాలు, మహిళల సిగపట్లు, యువతి యువకుల ప్రేమకథలు అనేకం ఇప్పటి వరకు చూశాం.. అయితే, ఇలాంటిదే ముంబై లోకల్‌ ట్రైన్‌కు సంబంధించిన మరో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు పురుషుల మధ్య జరిగిన ఫైటింగ్‌ నెటిజన్లకు ఫుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌గా మారింది. రైల్లో ఆ ఇద్దరు వ్యక్తులు.. ఒకరితో ఒకరు భీకర వాగ్వాదానికి పాల్పడుతుంటం కనిపించింది. దీనికి కారణం స్పష్టంగా లేదు గానీ, వీడియోలో మాత్రం వారు సాధారణంగా రద్దీగా ఉండే రైలులో కొట్టుకోవడం, మాటల దాడి చేసుకోవటం కనిపించింది.

వీడియోలో కనిపించినట్టుగా ఇది ముంబై లోకల్ ట్రైన్‌లో కనిపించిన సీన్‌. రైలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంది. అంత రద్దీలో ఓ ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలబడి ఉన్నారు. అంతలోనే ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహంతో నోరు పారేసుకుంటున్నారు. మాటకు మాట వదులుతూ ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు ముఖంపై, చెంపలపై వాయించేసుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న తోటి ప్రయాణికులు వారిని వారించే ప్రయత్నం చేశారు. అటు వైపు వ్యక్తిని కొందరు, ఇటు వైపు వ్యక్తిని మరికొందరు చల్లబరిచేందుకు చూస్తున్నారు.కానీ, ఆ ఇద్దరు ప్రయాణీకుల మధ్య చిన్నపాటి వాగ్వివాదం తీవ్ర ఘర్షణగా మారింది. దీంతో ఆరైలు కంపార్ట్‌మెంట్‌ మొత్తం ఆ నిమిషంలో భయానకంగా మారిపోయింది. చివరకు ఓ వ్యక్తి ఆ ఇద్దరి మధ్యలోకి దూరిపోయి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అప్పటి గానీ, ఆ ఇద్దరి మధ్య యుద్ధం కాస్త సద్దుమణిగింది.

ఇవి కూడా చదవండి

ముంబై లోకల్‌ రైల్లో జరిగిన ఈ ఘటనకు సంబందించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియోను చాలా మంది చూశారు. వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు, ట్విట్లు చేశారు. కొందరు నెటిజన్లు.. ఆ ఇద్దరు ప్రయాణికుల మధ్యలో దూరి వారి గొడవను ఆపేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అభినందిస్తున్నారు. ఇక రైల్లో ఉన్న మరికొంతమంది ప్రయాణీకులు ఈ ఫైటింగ్ సీన్‌ని రిఫ్రీగా ఎంజాయ్‌ చేస్తున్నారంటూ కామెంట్‌ చేశారు.

వీరి ఫైటింగ్‌ ఆపడానికి మధ్యలో వచ్చిన వ్యక్తికి నిజంగా హ్యాట్సాఫ్ అంటున్నారు చాలా మంది నెటిజన్లు. నేటి ప్రపంచ ప్రజలు చాలా బిజీగా ఉన్నారు. ఇతరులపై అంతగా ఆసక్తి చూపడం లేదు. చావు బతుకుల మధ్య ఉన్న వారిని కూడా పట్టించుకోకుండా వెళ్లిపోతారు. ఈ వ్యక్తి చేసిన పని నిజంగా మంచిదే అంటూ మరొక వినియోగదారు రాశారు. అతనిలాంటి వ్యక్తులు మా మధ్యలో కూడా ఉండాలని కోరుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..