Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

70 ఏళ్లుగా యంత్రంలోనే జీవిస్తున్న వ్యక్తి.. అన్నం, నీళ్లు అన్నీ అందులోనే.. అతని పోరాటం తెలిస్తే..

అది1952వ సంవత్సరం. ఈ వ్యాధి కారణంగా అతని శరీరం మొత్తం స్తంభించిపోయింది. అతని మెడపై భాగం మాత్రమే పని చేస్తోంది. అతని శరీరంలోని మిగిలిన భాగాలకు ప్రాణం లేదు. అటువంటి పరిస్థితిలో అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నాడు. దాంతో అతనిని ఒక యంత్రంలో ఉంచారు. దాంతో అతని ప్రాణాలను రక్షించగలిగారు. ఈ యంత్రం పేరు ఐరన్ లంగ్.

70 ఏళ్లుగా యంత్రంలోనే జీవిస్తున్న వ్యక్తి.. అన్నం, నీళ్లు అన్నీ అందులోనే.. అతని పోరాటం తెలిస్తే..
Iron Lung
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2023 | 5:02 PM

మీకు చెప్పకుండా మిమ్మల్ని గదిలో బంధిస్తే ఎలా ఉంటుంది..మొదట కాసేపు బాధపడతారు. ఆ తర్వాత కోపం వస్తుంది. విసుగు చెందుతారు. కోపాన్ని రకరకాలు బయట పెట్టడం ప్రారంభిస్తారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ నిగ్రహాన్ని కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే 70 ఏళ్ల క్రితం మెషీన్‌లో బంధించిన వ్యక్తి ప్రపంచంలోనే ఉన్నాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేటికీ అదే స్థితిలో బతకవలసి పరిస్థితి అతనిది. ఈ వ్యక్తి పేరు పాల్ అలెగ్జాండర్. అతను 5-10 సంవత్సరాలు కాదు 70 సంవత్సరాలుగా యంత్రం లోపల లాక్ చేయబడి ఉన్నాడు. అతని ఆహారం, పానీయాలన్నీ ఒకే యంత్రం లోపల జరుగుతాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే, మెషీన్‌లో బంధించబడినప్పటికీ, అతను డిగ్రీ చదువుకున్నాడు. ఒక పుస్తకం కూడా రాశాడు. అయితే ఇన్నాళ్లుగా ఆ వ్యక్తిని ఎందుకు మెషీన్‌లో బంధించాడో తెలిస్తే మీకు కన్నీళ్లు ఆగవు. ఆ కన్నీటి కథేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ వ్యక్తి పేరు పాల్ అలెగ్జాండర్. అతని వయస్సు 77 సంవత్సరాలు. పోలియో పాల్ అని కూడా పిలుస్తారు. అమెరికాలో నివాసం ఉంటున్న పాల్ కథేమిటంటే.. అతడికి కేవలం 6 ఏళ్ల వయసులోనే పోలియో సోకింది. అది1952వ సంవత్సరం. ఈ వ్యాధి కారణంగా అతని శరీరం మొత్తం స్తంభించిపోయింది. అతని మెడపై భాగం మాత్రమే పని చేస్తోంది. అతని శరీరంలోని మిగిలిన భాగాలకు ప్రాణం లేదు. అటువంటి పరిస్థితిలో అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్నాడు. దాంతో అతనిని ఒక యంత్రంలో ఉంచారు. దాంతో అతని ప్రాణాలను రక్షించగలిగారు. ఈ యంత్రం పేరు ఐరన్ లంగ్.

నివేదిక ప్రకారం..పాల్‌ను యంత్రం నుండి బయటకు తీయవచ్చు. కానీ అందుకు అతడు అంగీకరించలేదని తెలిసింది. అతను యంత్రం లోపలే తన జీవితాన్ని ఎంచుకున్నాడు. ఇప్పుడు పాల్ ఈ ఇనుప ఊపిరితిత్తుల యంత్రంలో ఎక్కువ కాలం జీవించే రోగి అయ్యాడు. అతని పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. అతని సంరక్షణ ఖర్చుల కోసం గతేడాది కూడా నిధులు సేకరించారు. ఒక ఫండ్ రైజర్ అతని కోసం 1 లక్ష 32 వేల డాలర్లు అంటే దాదాపు 1 కోటి 9 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇంతటి దయనీయ స్థితిలో ఉన్నప్పటికీ, పాల్ వదలకుండా తన చదువును కొనసాగించాడు. అతను కళాశాల నుండి పట్టభద్రుడవ్వడమే కాకుండా న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు. ఆ తర్వాత తనపై ఒక పుస్తకం కూడా రాశాడు. తన నోటితో అద్భుతంగా పెయింటింగ్ కూడా వేయగలగడం అతనికున్న అతిపెద్ద స్పెషాలిటీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్