జలపాతం ఒడ్డున దంపతుల ఫోటో షూట్‌.. ముంచుకొచ్చిన రాకాసి అలలు.. ఫోటోగ్రాఫర్‌ చెప్పిన మాటతో ఆ జంట ప్రాణం..!

ఆ ఇద్దరూ నిలబడి ఉన్న చోట ఆ ప్రదేశం చాలా చిన్నదిగా ఉంది. అది కూడా ఓ చిన్న కొండలా కనిపిస్తుంది. దిగువన సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. దూరంలో జలపాతాలు ఎంతో ఉదృతంగా, కనులకు విందుగా కనిపిస్తుంది. అవన్నీ తమ ఫోటోలో కనిపించే విధంగా ఆ జంట పోజులు పెడుతుండగా, ఫోటోగ్రాఫర్ వారిని ఫోటోను క్లిక్‌మనిపించాలని అడుగుతారు.. అయితే, అందుకు ఆ ఫోటోగ్రాఫర్‌.. అక్కడ్నుంచి కాదు.. ముందుకు రావాలంటూ వారిని

జలపాతం ఒడ్డున దంపతుల ఫోటో షూట్‌.. ముంచుకొచ్చిన రాకాసి అలలు.. ఫోటోగ్రాఫర్‌ చెప్పిన మాటతో ఆ జంట ప్రాణం..!
photo shoot
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 02, 2023 | 5:39 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇందులో ఓ జంట అందమైన వాటర్‌ఫాల్‌ అంచున ఎంజాయ్ చేయడం చూడవచ్చు. వాళ్లిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. వారు దూరం నుండి జలపాతాన్ని మైమరచిపోతున్నారు.. కానీ కొన్ని సెకన్లలో అక్కడ ఊహించని భయానకం జరిగింది. ఇది అక్కడ ఎవరూ ఊహించలేదు. అదృష్టవశాత్తు ఈ జంట తృటిలో ప్రాణాలతో బయటపడింది. ఆ క్షణంలో ఫోటోగ్రాఫర్ మనస్సులో వచ్చిన ఆలోచన ఆ ఇద్దరినీ బ్రతికించిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్‌ని ప్రశంసిస్తున్నారు. దంపతుల ప్రాణాలు నిలబెట్టిన ఫోటోగ్రాఫర్‌ నిజంగా దేవుడు అంటూ నెటిజన్లు పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే…

వీడియో ప్రారంభంలో ఒక జంట రెండు రాళ్లు కిందకు దిగి తమను ఫోటో తీయాలంటూ ఫోటోగ్రాఫర్‌ని అడుగుతారు. ఆ ఇద్దరూ నిలబడి ఉన్న చోట ఆ ప్రదేశం చాలా చిన్నదిగా ఉంది. అది కూడా ఓ చిన్న కొండలా కనిపిస్తుంది. దిగువన సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. దూరంలో జలపాతాలు ఎంతో ఉదృతంగా, కనులకు విందుగా కనిపిస్తుంది. అవన్నీ తమ ఫోటోలో కనిపించే విధంగా ఆ జంట పోజులు పెడుతుండగా, ఫోటోగ్రాఫర్ వారిని ఫోటోను క్లిక్‌మనిపించాలని అడుగుతారు.. అయితే, అందుకు ఆ ఫోటోగ్రాఫర్‌.. అక్కడ్నుంచి కాదు.. ముందుకు రావాలంటూ వారిని తిరిగి రమ్మని అడిగాడు. దాంతో ఆ ఇద్దరూ ముందుకు తిరిగి వచ్చేశారు.. ఇంతలోనే పెను ఉప్పెన ముంచేసింది. పెద్ద ఎత్తున నీటి కెరటం వారు నిలబడి ఉన్న ప్రదేశాన్ని ఊడ్చేసుకుపోయింది. సమీపంలోని ప్రజలంతా భయంతో కేకలు వేస్తూ.. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి దూరంగా పరిగెత్తారు. ఇదంతా దూరం నుంచి వీడియో తీశారు కొందరు సందర్శకులు. ఆ తర్వాత వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అదికాస్త వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో సచ్కద్వాహై అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఈ సంఘటన ఇండోనేషియాలోని బాలికి చెందినదిగా తెలిసింది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను చూశారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వీరి అదృష్టం బాగుంది.. అందుకే ప్రాణాలతో బయటపడ్డారు. అర క్షణం ఆలస్యం అయినట్టయితే.. ఏం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చాలా మంది నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక