AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EC vs Rahul Gandhi: రాహుల్ ప్రశ్న- ఈసీ జవాబు మరి.. ప్రజలు ఇస్తున్న మార్కులు?

బిహార్‌లో 65 లక్షల ఓట్ల తొలగింపు. మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లు. ఈవీఎంలపై ప్రాంతీయ పార్టీల అనుమానాలు. మళ్లీ బ్యాలెట్‌ పద్దతిని తీసుకురావాలని డిమాండ్లు. కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చంతా ఓట్‌ చోరీలు, ఓట్ల తొలగింపు, ఎన్నికల సంఘంపై విమర్శలు, వివాదాలు. ఇది తప్ప మరో టాపిక్‌ లేదు. మరో రెండు నెలల్లో బిహార్‌ ఎలక్షన్స్‌ పెట్టుకుని ఇప్పుడు ఓటర్ల జాబితా సవరణేంటనేది విపక్షాల ప్రధాన విమర్శ. ఇండీ కూటమి ఒకే మాటపై నిలబడి పోరాటానికి దిగిన సందర్భాలు ఉన్నాయో లేవో గానీ.. ఈ ఓటర్ల జాబితాపై మాత్రం ఏకతాటిపైకి వచ్చాయి. ఎలక్షన్‌ కమిషన్‌పై రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణల తీవ్రత అలాంటిది. బట్.. ఈసీ ప్రెస్‌మీట్‌ పెట్టి ఒకటే అడిగింది. ఆధారాలుంటే అఫిడవిట్‌ ఇవ్వండి, లేదా క్షమాపణ చెప్పమంది. లేదంటే చేసిన ఆరోపణలన్నీ నిరాధారమే అని దేశం నమ్ముతుంది అని క్లోజ్‌ చేశారు. ఇంతకీ బిహార్‌లో జరుగుతున్నదేంటి? రాహుల్ అడిగిన ప్రశ్నలకు ఈసీ ఇచ్చిన సమాధానాలేంటి?

EC vs Rahul Gandhi:  రాహుల్ ప్రశ్న- ఈసీ జవాబు మరి.. ప్రజలు ఇస్తున్న మార్కులు?
EC Vs Rahul Gandhi
Ram Naramaneni
|

Updated on: Aug 19, 2025 | 9:35 PM

Share

2016లో అప్పటి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్‌కు ఓ సమాధానం ఇచ్చారు. భారత్‌లో 2 కోట్ల మంది బంగ్లాదేశ్ వలసదారులు ఉన్నారనేది ఆ సమాధానం. ఆ 2 కోట్లలో ఎక్కువ మంది తలదాచుకున్నది బిహార్‌లో. మరీ ముఖ్యంగా బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో బంగ్లాదేశ్ వలసదారులు ఎక్కువ. బిహార్‌లో 17 శాతం ముస్లింలు ఉంటే.. ఒక్క సీమాంచల్‌లోనే 47 శాతం మంది ముస్లింలు ఉన్నారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పేరుతో బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు మూలం ఈ డేటానే. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఈ ప్రాసెస్‌ను బిహార్‌లో మొదలుపెట్టింది. పైకి చూస్తే ఈసీ చేసేది పర్ఫెక్ట్. కాకపోతే.. ఆ టైమింగే రాంగ్‌ అనేది ప్రతిపక్షాల విమర్శ. ఇంతకీ.. ఏంటీ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌? ఎలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసే ఓటర్ల జాబితాలో విదేశీయులు కూడా ఉంటారా? ఉంటారు. ఉన్నారు కూడా. బిహార్‌లో ఇప్పటికిప్పుడు స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ చేపట్టడానికి కారణాల్లో ఇదీ ఒకటి. ఇక్కడే ఓ అనుమానం వస్తోంది. ఓటర్ లిస్ట్‌లోకి విదేశీయులు ఎలా వచ్చారసలు? చాలా సింపుల్. ఓటు హక్కు పొందాలంటే ఫామ్-6 అప్లై చేస్తే చాలు. ది రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎలక్టర్స్‌ రూల్స్-1960 ప్రకారం తాము భారతీయులమే అని నిరూపించుకునేందుకు ఎలాంటి డాక్యుమెంట్స్‌ ఇవ్వక్కర్లేదు. నిజానికి, దేశ పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎలక్షన్‌ కమిషన్‌కు లేదు కూడా. ఆ పని చేయాల్సింది...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి