AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు..

Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. ప్రజలంతా ఘాడ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున..

Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనాలు..
Shiva Prajapati
|

Updated on: Feb 08, 2021 | 6:23 AM

Share

Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. ప్రజలంతా ఘాడ నిద్రలో ఉన్న సమయంలో తెల్లవారుజామున 4.56 గంటలకు ఒక్కసారిగా భూమి కంపించింది. దాంతో జనాలు ఉలిక్కిపడి లేచారు. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. భయంతో చిన్నా, పెద్దా అంతా ఇళ్ల నుంచి పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అధికారులు.. ప్రజలను ఆరా తీశారు. భూంకంప తీవ్రతను పరీక్షించిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, గత కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్‌లో స్వల్ప భూప్రకంపనలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారం నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో మంచు చరియలు విరిగి పడటంతో ధౌలీగంగా నదిని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.

ANI Tweet:

Also read:

పెద్దిరెడ్డికి ఫ్రీడమ్‌ దొరికింది, కానీ నోటికి తాళం పడింది. ఎస్ఈసీ ఆంక్షలపై మండిపడుతున్న వైసీపీ నేతలు

Mustard oil: వ్యాధులను ధరిచేరనీయని ఆవనూనే గురించి మీకు ఈ విషయాలు తెలుసా?