Sreesanth Angry: కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ క్రికెటర్ శ్రీశాంత్.. కారణమిదే..!
Sreesanth Angry: టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్‌కు ఆగ్రహం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలుసు.
Sreesanth Angry: టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్‌కు ఆగ్రహం వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో దాదాపు అందరికీ తెలుసు. ఇక ఆయన భారత క్రికెట్ లెజెండ్ సచిన్‌ను ఎంతలా అభిమానస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సచిన్ టెండూల్కర్ ప్లెక్సీపై కేరళ కాంగ్రెస్ నేతలు నల్లటి రంగు పోశారు. ఇంకేముంది ఆ ఘటనపై శ్రీశాంత్ తీవ్రంగా స్పందించాడు. సచిన్ ప్లెక్సీపై నల్ల రంగు పోసిన కాంగ్రెస్ నేతలను గూండాలు అంటూ ఫైర్ అయ్యాడు. వారి చర్యను తీవ్రంగా ఖండించాడు.
‘కాంగ్రెస్ గూండాల చర్యలతో తీవ్రంగా బాధపడ్డాను. 130 కోట్ల భారతీయుల మనోభావాలను దెబ్బతీశారు. ఎవరెన్ని చేసినా.. సచిన్ ఎప్పటికీ భారత దేశానికి గర్వకారణమే’ అంటూ శ్రీశాంత్ ట్వీట్ చేశాడు. రైతుల ఆందోళనపై అమెరికన్ పాప్ సింగర్ రిహన్నా చేసిన ట్వీట్‌పై సచిన్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. అయితే, ఇన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తుంటే స్పందించని సచిన్.. ఇప్పుడు స్పందించడం ఏంటంటూ దేశ వ్యాప్తంగా సచిన్ తీరును పలువురు నిరసిస్తున్నారు. ఈ క్రమంలోనే కేళరకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆయన ప్లెక్సీపై నల్ల రంగు పోసి నిరసన వ్యక్తం చేశారు.
Sreesanth Tweet:
Appalled by the disgraceful act by @INCKerala hoodlums. By pouring ink on the god of Cricket, legend & Bharat Ratna, @sachin_rt, they have hurt the feelings of 130 Crore I stand with the people of Kerala in condemning this act.#KeralaWithSachin #NationWithSachin.
— Sreesanth (@sreesanth36) February 6, 2021
Also read:
Congress MLA Birthday: ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు నిర్వహించండి.. ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు..!