Congress MLA Birthday: ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు నిర్వహించండి.. ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు..!

Congress MLA Birthday: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పుట్టిన రోజు..

Congress MLA Birthday: ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు నిర్వహించండి.. ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 08, 2021 | 4:37 AM

Congress MLA Birthday: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలను నిర్వహించాలంటూ ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ మేరకు ఉత్తర్వులు కూడా ఇచ్చారు. అంతేకాదండోయ్.. ఆ ఉత్తర్వుల్లో బర్త్‌డే వేడుక కోసం టెంట్ మేనేజ్‌మెంట్ ఎవరు చూసుకోవాలి? వేడుకలకు హాజరయ్యే వారి వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు ఎవరు చేయాలి? కేక్ కటింగ్ వంటి ఏర్పాట్లకు సంబంధించిన కేటాయింపులు కూడా ఆ ఉత్తర్వుల్లో ఉన్నాయి. పూర్తి వివరాల్లోకెళితే.. ఫిబ్రవరి 07, 2021న చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శకుంతల సాహు పుట్టిన రోజు. అయితే ఆమే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలంటూ ప్రభుత్వ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఉత్తర్వుల్లో పుట్టిన రోజు తేదీ సహా.. పుట్టిన రోజు వేడుకలు నిర్వహణకు సంబంధించి ఏ ఏ అధికారి.. ఏ బాధ్యతలు తీసుకోవాలనేది వివరంగా పేర్కొనబడి ఉంది. ఉద్యోగుల పేర్లతో సహా, వారి బాధ్యతలు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే, ఆ ఉత్తర్వులకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన వారి ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఆ ఫోటోనూ మీరూ చూసేయండి.

Also read:

ట్రంప్‌ అభిశంసన, శాంటియాగో ర్యాలీ, కొపెన్‌ హెగన్‌లో భారీ ఆందోళన, మయన్మార్‌లో ప్రజల సెల్యూట్‌: టోటల్ వరల్డ్ రౌండప్

America President: బైడెన్‌కు మహిళ లేఖ.. అది చదవి వెంటనే ఫోన్ చేసిన అమెరికా అధ్యక్షుడు.. ఆ లేఖలో ఏముందంటే..