Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌ అభిశంసన, శాంటియాగో ర్యాలీ, కొపెన్‌ హెగన్‌లో భారీ ఆందోళన, మయన్మార్‌లో ప్రజల సెల్యూట్‌: టోటల్ వరల్డ్ రౌండప్

చిలీలో పోలీసుల కాల్పుల్లో మరణించిన నిరసనకారుడు ఫ్రాన్సిస్కో మార్టినెజ్‌కు సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. శాంటియాగోలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు

ట్రంప్‌ అభిశంసన, శాంటియాగో ర్యాలీ, కొపెన్‌ హెగన్‌లో భారీ ఆందోళన, మయన్మార్‌లో ప్రజల సెల్యూట్‌: టోటల్ వరల్డ్ రౌండప్
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 08, 2021 | 4:32 AM

చిలీలో పోలీసుల కాల్పుల్లో మరణించిన నిరసనకారుడు ఫ్రాన్సిస్కో మార్టినెజ్‌కు సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. శాంటియాగోలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు.

పాస్‌పోర్ట్‌ విషయంలో డెన్మార్క్‌ తీసుకున్ననిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొపెన్‌ హెగన్‌లో భారీ ఆందోళన నిర్వహించారు. కోవిడ్ 19 వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి మాత్రమే పాస్‌పోర్టు మంజూరు చేసి విదేశాలకు వెళ్లడానికి అనుమతిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో.. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై అక్కడి ప్రజలు మూడు వేళ్ల సెల్యూట్‌తో నిరసన తెలిపారు. హంగర్‌ గేమ్స్‌ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. కారు హారన్లు మోగిస్తూ, సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

అమెరికా సెయింట్ లూయిస్ జైలులో ఖైదీలు విధ్వంసం సృష్టించారు. కుర్చీలు, అద్దాలను ధ్వంసం చేశారు. జైల్ బిల్డింగ్‌కు నిప్పు పెట్టారు. నీటిపైపులను పగలగొట్టారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జైలు అధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఖైదీలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని అధికారులు ప్రకటించారు.

ప్రపంచం మీదకు కరోనా వైరస్‌ను ఎగదోసిన చైనా.. ఇప్పుడూ అదే తీరుగా వ్యవహరిస్తోంది. సంక్రమణ రేటు మందగించినప్పటికీ.. వైరస్‌ సంబంధ కేసుల్లో చైనా అబద్ధాలు చెప్తున్నదన్నఅనుమానాలు ప్రపంచ దేశాల నుంచి వ్యక్తం అవుతున్నాయి. వైరస్‌కు సంబంధించిన సమాచారంపై పారదర్శక వైఖరి అవలంభించాలని సూచిస్తున్నాయి.

పాక్ ఆర్మీకి చైనా సైన్యం కరోనా టీకా సరఫరా చేసింది. ఇప్పటికే 5 లక్షల టీకా డోసులు అందాయి. పాక్‌లో ఇప్పటి వరకూ 5 లక్షల 54 వేల మందికి కరోనా సోకగా.. మరణాల సంఖ్య 12 వేలకు చేరింది. కాంబోడియా మిలిటరీకి కూడా చైనా సైన్యం కరోనా టీకాలు అందజేసింది.

మరోవైపు భారత్‌ సైతం కంబోడియాకు కరోనా టీకా పంపించేందుకు నిర్ణయించింది. త్వరలో మంగోలియా, పసిఫిక్ సముద్రంలోని ఇతర ద్వీప సముదాయాలకు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆర్థిక, అంతర్జాతీయ వ్యవహారాల్లో చైనా ఆధిపత్యానికి సవాలు విసురుతోంది.

దక్షిణాఫ్రికా స్ట్రెయిన్‌‌‌కు సంబంధంచి తమ టీకా పరిమిత స్థాయిలో మాత్రమే రక్షణ కల్పించగలదని ప్రకటించింది ఆస్ట్రాజెనెకా. తీవ్రస్థాయి కేసుల విషయంలో ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఇప్పుడే చెప్పలేమంటోంది. కాని ఈ కేసుల్లో టీకా పూర్తి రక్షణ కల్పించగలదని విశ్వసిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా తెలిపింది.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను అభిశంసించే తీర్మానం రేపు సెనేట్ ముందుకు రానుంది. నేర విచారణ కూడా అదే రోజున ప్రారంభంకానుంది. క్యాపిటల్​హిల్​భవనంపై దాడికి ట్రంప్.. తన మద్దతుదార్లను రెచ్చగొట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి.

రాబోయే మహమ్మారి కరోనా వైరస్‌ గురించి 2015లోనే బిల్‌ గేట్స్‌ హెచ్చరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రపంచం అంటువ్యాధి మహమ్మారిలను తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని ఆనాడే జోస్యం చెప్పారు బిల్‌ గేట్స్.

జవాబుదారీ కావాల్సిందే, అంతర్జాతీయ వ్యవస్థలను చైనా విచ్చలవిడిగా దుర్వినియోగం చేసింది: అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి