AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టిన భారీ పక్షి.. దెబ్బకు ఆగిపోయిన రైలు.. లోకో ఫైలట్‌కు గాయాలు!

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ప్యాసింజర్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. బారాముల్లా-బనిహాల్ మార్గంలో శనివారం (నవంబర్ 8) ఉదయం ఒక పక్షి రైలు అద్దాన్ని ఢీకొట్టింది. గాజు పగిలి లోకో పైలట్ గాయపడ్డాడు. గాయపడిన పైలట్ విశాల్‌కు అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్‌లో ప్రథమ చికిత్స అందించారు.

ఎక్స్‌ప్రెస్ రైలును ఢీకొట్టిన భారీ పక్షి.. దెబ్బకు ఆగిపోయిన రైలు.. లోకో ఫైలట్‌కు గాయాలు!
Eagle Hits Train Near Bijbehara
Balaraju Goud
|

Updated on: Nov 08, 2025 | 12:18 PM

Share

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ప్యాసింజర్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. బారాముల్లా-బనిహాల్ మార్గంలో శనివారం (నవంబర్ 8) ఉదయం ఒక పక్షి రైలు అద్దాన్ని ఢీకొట్టింది. గాజు పగిలి లోకో పైలట్ గాయపడ్డాడు. గాయపడిన పైలట్ విశాల్‌కు అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్‌లో ప్రథమ చికిత్స అందించారు. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు. ఈ సంఘటన బిజ్‌బెహారా-అనంత్‌నాగ్ సెక్షన్ మధ్య జరిగిందని భారత రైల్వే అధికారులు తెలిపారు.

శ్రీనగర్-అనంత్‌నాగ్ మధ్య నడుస్తున్న రైలులో ఒక వింత ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒక డేగ రైలు ముందుకి వచ్చి గాజును ఢీకొట్టింది. దీని కారణంగా లోకో ఫైలట్ విశాల్ గాయపడ్డాడు. ట్రెయిన్ డ్రైవర్ గాయపడిన వెంటనే రైలును అత్యవసర పరిస్థితిలో ఆపవలసి వచ్చింది. గాయపడిన విశాల్‌కు అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్‌లో ప్రథమ చికిత్స అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. అలాగే తనిఖీ కోసం రైలును అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్‌లోనే కొద్దిసేపు నిలిపివేసి, తర్వాత తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇచ్చారు.

అయితే, ఈ ప్రమాదంలో రైలు ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. గాయపడిన లోకో ఫైలట్ విశాల్‌కు సంబంధించిన వీడియో బయటపడింది. అతని మెడలో గాజు ముక్కలు చిక్కుకున్నట్లు, ముక్క నుంచి రక్తం కారుతూ కనిపించింది. వైద్య బృందాలు గాజు ముక్కలను తొలగించి, చికిత్స అందించారు.

ఇక్కడ వీడియో చూడండి..

ప్రమాదం తర్వాత, గాయపడ్డ గద్ద రైలు లోపల ఉండిపోయింది. శ్రీనగర్-అనంతనాగ్ మధ్య రైలు ప్రయాణిస్తున్నప్పుడు ఈ వింత సంఘటన జరిగిందని లోకో ఫైలట్ పేర్కొన్నారు. రైలు కదులుతున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో రైలు కుదుపుకు గురైందని, దీంతో ఆశ్చర్యపోయామని ప్రయాణికులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us