ఢిల్లీలో కోవిడ్ టెస్ట్ రిపోర్టులను ఫోర్జరీ చేసిన డాక్టర్, రోగులకు బురిడీ, అరెస్ట్
ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో అడ్డదారిన డబ్బు సంపాదించేందుకు ఢిల్లీలో ఓ డాక్టర్ అతని సహచరులు 'అడ్డదారులు' తొక్కారు. కోవిడ్ రోగులకు, ఇతర ప్రజలకు తప్పుడు (ఫేక్) రిపోర్టులు ఇచ్చి వారిని మోసగించారు.
ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో అడ్డదారిన డబ్బు సంపాదించేందుకు ఢిల్లీలో ఓ డాక్టర్ అతని సహచరులు ‘అడ్డదారులు’ తొక్కారు. కోవిడ్ రోగులకు, ఇతర ప్రజలకు తప్పుడు (ఫేక్) రిపోర్టులు ఇచ్చి వారిని మోసగించారు. స్థానికంగా ఉన్న ఓ ల్యాబ్ లెటర్ హెడ్ ను వినియోగించి గుట్టు చప్పుడు కాకుండా ఛీట్ చేస్తూ వచ్చారు. తప్పుడు రిపోర్టులతో 50 మందికి పైగా వ్యక్తులను వారు మోసం చేసినట్టు వెల్లడైంది. ఇది ఎలా బయటకు పొక్కిందంటే..విపుల్ సైని అనే వ్యక్తి తన స్నేహితుడైన రిషబ్ ని అయిదు రోజుల క్రితం ఈ డాక్టర్ ల్యాబ్ కి టెస్టు కోసం పంపాడు. రిషబ్ తన శాంపిల్ ఇచ్చి వచ్చాడని, ఆ తరువాత ఇతనికి కోవిద్ పాజిటివ్ ఉన్నట్టు రిపోర్టు ఇచ్చారని తెలిసింది. దీంతో ఆందోళనకు గురైన రిషబ్ తనకు తాను ఐసోలేషన్ లోకి వెళ్లినప్పటికీ తనలో ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడకపోవడంతో మళ్ళీ మరో ల్యాబ్ లో టెస్ట్ చేయించుకున్నాడని వెల్లడైంది. ఈ రిపోర్టులో నెగటివ్ రావడంతో సదరు డాక్టర్ ల్యాబ్ వద్దకు వెళ్లి నిలదీయగా అప్పటికే ఇతని పేరుతో ఉన్న ఇతని రిపోర్టులు, రికార్డులు ఏవీ కనబడలేదట. దీనికి ఆ డాక్టర్, అతని సహచరుల నుంచి రిషబ్ కి మౌనమే ఎదురైంది. చివరకు తనను ఛీట్ చేశారని రిషబ్ తెలుసుకున్నాడు. ఢిల్లీ లోని ఓ ప్రముఖ ల్యాబ్ లెటర్ హెడ్ ని సంపాదించి..ఈ వైద్యుడు ఇలా ఫేక్ రిపోర్టులు ఇస్తూ వచ్చాడు. మొత్తానికి పోలీసులు ఇతడ్ని అరెస్టు చేశారు.
అసలే కోవిడ్ సమస్యతో సతమవుతున్న రోగులను, ఇతర అమాయకులను మోసగిస్తున్న ఈ డాక్టర్ పైన, ఇతని సహచరులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: COVID Care Center: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఏబీవీపీ కార్యకర్తల హంగామా..విమర్శల వెల్లువ..వైరల్ గా మారిన వీడియో
Viral News: అసలైన హీరో ఇతడేగా.. మనసు చలించి అంబులెన్స్ డ్రైవర్గా మారిన నటుడు..