మలేరియాకు వ్యాక్సిన్ వచ్చిందా..! యాబై వేల ఏళ్ల నాటి వ్యాధికి టీకా..? మరి కరోనా సంగతేంటి..
Malaria Vaccine : మలేరియా అనేది యాభై వేల సంవత్సరాలుగా మొత్తం మానవ జాతిని బాధపెట్టిన ఒక వ్యాధి. కానీ ఈ రోజు వరకు ఎటువంటి
Malaria Vaccine : మలేరియా అనేది యాభై వేల సంవత్సరాలుగా మొత్తం మానవ జాతిని బాధపెట్టిన ఒక వ్యాధి. కానీ ఈ రోజు వరకు ఎటువంటి వ్యాక్సిన్ కనుగొనబడలేదు. గత ఏడాది ప్రపంచంలో కోవిడ్ వల్ల అనేక మరణాలు సంభవించాయి. ఆఫ్రికాలో ప్రతి సంవత్సరం మలేరియా కారణంగా అనేక మరణాలు సంభవిస్తాయి. ప్రతి సంవత్సరం 500 మిలియన్ల మంది మలేరియా బారిన పడుతున్నారు. 1 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నారు. మలేరియాతో మరణించే వారిలో ఎక్కువ మంది పిల్లలు, సహారా ఆఫ్రికాకు చెందిన యువకులు ఉంటున్నారు. మలేరియా ప్రధానంగా ఆసియా, ఆఫ్రికాలో వ్యాపిస్తుంది. ఇప్పటి వరకు మలేరియాను నివారించగల టీకా లేదా వ్యాక్సిన్ కనుగొనబడలేదు.
కానీ ఇటీవల వైద్యులు ఒక సరికొత్త విషయాన్ని కనుగొన్నారు. బుర్కినా ఫాసోలో కొన్నేళ్లుగా మలేరియా వ్యాక్సిన్‌పై పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్ష ప్రారంభ ఫలితాల్లో శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. ఈ ప్రారంభ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మలేరియాకు వ్యాక్సిన్ తయారు చేయడంలో, వ్యాధి మూలం నుంచి తొలగించడంలో వైద్య శాస్త్రం విజయవంతమవుతుందని నమ్ముతున్నారు.ఒక సంవత్సరం పాటు కొనసాగిన ఈ టీకా విచారణ ప్రక్రియలో మొత్తం నాలుగున్నర మంది పిల్లలు పాల్గొన్నారు.
ఈ పిల్లలు 5 నెలల నుంచి 17 నెలల వయస్సులో ఉన్నారు. టీకా మూడు వేర్వేరు సమూహాలను పరీక్షలో చేర్చారు. టీకా ఫలితాలను పరీక్షించడానికి మూడు వేర్వేరు పరీక్షలు జరిగాయి. మొదటి సమూహానికి R21 / Matrix-M వ్యాక్సిన్ చిన్న మొత్తాలను ఇచ్చారు. రెండో సమూహానికి R21 / Matrix-M వ్యాక్సిన్ చిన్న మొత్తాన్ని ఇచ్చారు. మూడో సమూహానికి ఈ టీకా ఇవ్వబడలేదు. బదులుగా ఈ బృందానికి రాబిస్‌తో టీకాలు వేయించారు. అధిక మొత్తంలో R21 / మ్యాట్రిక్స్-ఎం వ్యాక్సిన్ ఇచ్చిన సమూహం మలేరియాకు వ్యతిరేకంగా 77 శాతం సక్సెస్ రేటును కలిగి ఉంది.
చిన్న మొత్తంలో R21 / మ్యాట్రిక్స్-ఎం వ్యాక్సిన్ ఇచ్చిన సమూహం 71 శాతం విజయాన్ని సాధించింది. టీకా ఇవ్వని మూడో సమూహంలో ఎటువంటి మార్పు కనిపించలేదు. దోమ కాటు వల్ల కలిగే ఈ ప్రాణాంతక వ్యాధి గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు, శాస్త్రవేత్తలను కలవరపెట్టింది. దాని చికిత్స కోసం వివిధ రకాల మందులు రూపొందించబడ్డాయి. అయితే వ్యాధి మూలాల నుంచి నిర్మూలించబడే పద్ధతి మాత్రం ఇప్పటి వరకు కనుగొనబడలేదు.