Digital Frauds: కరోనా కష్ట సమయాన్ని సొమ్ము చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. భారత్‌లో పెరుగుతున్న మోసాలు..
Digital Frauds: కరోనా మహమ్మారి ఓ వైపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైరస్ దేశ వ్యాప్తంగా ఉధృతంగా వ్యాపిస్తుండడంతో ప్రస్తుతం చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో డిజిటల్ లావా దేవీలు బాగా పెరిగాయి...
Digital Frauds: కరోనా మహమ్మారి ఓ వైపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైరస్ దేశ వ్యాప్తంగా ఉధృతంగా వ్యాపిస్తుండడంతో ప్రస్తుతం చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో డిజిటల్ లావా దేవీలు బాగా పెరిగాయి. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. కరోనా సమయంలో ఓవైపు ప్రజలు కష్టాలు పడుతుంటే మరోవైపు సైబర్ నేరగాళ్లు డిజిటల్ లావాదేవీల ద్వారా వ్యాపార సంస్థలను మోసం చేసే ఉదంతాలు పెరుగుతున్నాయి. గతేడాది ఇలాంటివి 28 శాతం పెరిగినట్లు ట్రాన్స్ యూనియన్ వెల్లడించింది.
ఈ తరహా కేసులు ఎక్కువగా ముంబైలో ఉండగా తదుపరి స్థానాల్లో ఢిల్లీ, చెన్నైలు ఉన్నాయి. ఈ విషయమై ట్రాన్స్‌యూనియన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షాలీన్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విస్తరించిన తర్వాత డిజిటల్ వినియోగం పెరగడం కారణంగా మోసగాళ్లు దానిని ఆసరగా తీసుకుంటూ మోసాలు పాల్పడుతున్నారు అని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా పలు వెబ్‌సైట్లు, యాప్స్‌ల ద్వారా జరిగిన లావాదేవీల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. గతేడాది జరిగిన మోసాలలో అత్యధికంగా లాజిస్టిక్స్ రంగంలో 224 శాతం పెరగ్గా, టెలికం రంగంలో 200 శాతం, ఆర్థిక సేవల్లో 89 శాతం పెరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ ఉత్పత్తుల డెలివరీని దారి మళ్లించడం ద్వారా మోసగించే ప్రయత్నాలు ఎక్కువగా జరిగినట్లు గుర్తించారు.
Also Read: ఇమ్యూనిటీ కోసం యాపిల్స్ తెగ తినేస్తున్నారా? కరోనా టైంలో ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!
ఢిల్లీలో కోవిడ్ టెస్ట్ రిపోర్టులను ఫోర్జరీ చేసిన డాక్టర్, రోగులకు బురిడీ, అరెస్ట్