AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇమ్యూనిటీ కోసం యాపిల్స్ తెగ తినేస్తున్నారా? కరోనా టైంలో ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!

Side Effects of Apples : ఏ ఆహారమైనా సరే మితంగా తీసుకుంటే శరీరానికి ఇముడుతుంది కానీ అధికంగా తీసుకుంటే విషంగా మారుతుంది.

ఇమ్యూనిటీ కోసం యాపిల్స్ తెగ తినేస్తున్నారా? కరోనా టైంలో ఎక్కువగా తింటే కలిగే నష్టాలు ఇవే..!
Side Effects Of Apples
uppula Raju
|

Updated on: Apr 30, 2021 | 6:36 PM

Share

Side Effects of Apples : ఏ ఆహారమైనా సరే మితంగా తీసుకుంటే శరీరానికి ఇముడుతుంది కానీ అధికంగా తీసుకుంటే విషంగా మారుతుంది. ఇది మన పెద్దలు చెప్పిన మాట. అందుకే తక్కువగా తినండి ఎక్కవగా రోజులు బతకండి అంటారు. అయితే ఈ కరోనా సమయంలో కొంతమంది అతి తెలివిగలవారు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి సాధారణం కంటే ఎక్కువగా తినేస్తున్నారు. దీనివల్ల కరోనా రాకపోవడం దేవుడెరుగు కానీ ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశమే ఎక్కువ. ఇప్పుడు యాపిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం రాదు అంటారు. యాపిల్ వల్ల ఆరోగ్యం మెరుగు అవుతుంది ఇది నిజం. అలాగని యాపిల్స్ ను ఎక్కువగా తింటే కొన్ని నష్టాలు కూడా కలగవచ్చు. నిజానికి ఎవరికైనా అనారోగ్యం చేస్తే వెంటనే వారికి యాపిల్స్ తినిపిస్తారు. చాలా మంది డాక్టర్లు కూడా యాపిల్స్ ను తినమని చెబుతారు. అమెరికన్ అసోసియేషన్ ఫర్ కేన్సర్ రీసెర్చ్ నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం యాపిల్ వల్ల పాంక్రియాస్ కేన్సర్ పాటు అనేక అనారోగ్యాలు తగ్గుతాయట. అయితే లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

కుటుంబంలో ఎవరికైనా ఎలర్జీ ఉంటే.. యాపిల్ నుంచి దూరంగా ఉండటం ఉత్తమం. ఎందుకంటే యాపిల్ స్కిన్ పై ఉండే వ్యాక్స్ వల్ల ఎలర్జీ సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశం ఉంది. వ్యాక్స్ లో ఉండే సర్ఫర్ డైయాక్సైడ్ వల్ల గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యాపిల్ ను పండించేందుకు చాలా మంది క్రిమి సంహారక మందులను ఎక్కువగా వాడతారు. ఈ పెస్టిసైడ్స్ వల్ల శరీరానికి ఎంతో హాని కలిగే అవకాశం ఉంది.

యాపిల్ విత్తనాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. యాపిల్ సీడ్స్ కడుపులోకి వెళ్తే ఆనారోగ్యం.. కొన్ని సార్లు మరణం కూడా సంభవించవచ్చు. అయితే ఒకటి రెండు విత్తనాల వల్ల అంతగా నష్టం కలగకపోయినా… దీర్ఘకాలికంగా వాటివల్ల సమస్యలు వస్తాయి. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి. దీని వల్ల కొన్ని నిమిషాల్లో మరణం సంభవించే అవకాశం ఉంది. అయితే యాపిల్ తినేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

ఒక‌ప్పుడు స్కూల్ డ్రాప‌వుట్‌.. నేడు వంద‌ల మందికి ఉచితంగా కోచింగ్ అందిస్తున్నాడు.. ఆద‌ర్శం.. ఏడు కొండలు జీవితం..

OVID Care Center: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఏబీవీపీ కార్యకర్తల హంగామా..విమర్శల వెల్లువ..వైరల్ గా మారిన వీడియో