AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించినట్లు లంగ్స్ ముందే అలెర్ట్ చేస్తాయంటున్న శాస్త్రజ్ఞులు.. ఎలా తెలుసుకోవాలంటే..!

Corona Virus: చైనాలో పుట్టిన కరోనా వైరస్ గత ఏడాదికి పైగా ప్రపంచ దేశాలలో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. ఈ వైరస్ బారిన పడిన బాధిత దేశాలు కట్టడికోసం చేయని...

Corona Virus: కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించినట్లు లంగ్స్ ముందే అలెర్ట్ చేస్తాయంటున్న శాస్త్రజ్ఞులు.. ఎలా తెలుసుకోవాలంటే..!
Corona Lungs
Surya Kala
|

Updated on: May 01, 2021 | 11:38 AM

Share

Corona Virus: చైనాలో పుట్టిన కరోనా వైరస్ గత ఏడాదికి పైగా ప్రపంచ దేశాలలో కల్లోలం సృష్టిస్తూనే ఉంది. ఈ వైరస్ బారిన పడిన బాధిత దేశాలు కట్టడికోసం చేయని ప్రయత్నాలు లేవు.. శాస్త్రజ్ఞులు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు అమెరికా, యూరోపియన్ కంట్రీస్ భారత్ వంటి దేశాలు కరోనా నివారణకు టీకాలను ఇస్తున్నాయి. మరోవైపు కోవివ్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. అయితే ఎక్కువమంది కరోనా అంటే ప్రాణాంతక వ్యాధి అనే భయంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయి. అయితే ఎవరైనా కరోనా బారిన పడితే.. వారికీ ఊపిరితిత్తులు ముందే హెచ్చరిస్తాయని… శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయాన్నీ మధుమేహ వ్యాధితో బాధపడుతున్న కోవిడ్ బాధితుల్లో గుర్తించారట.

కరోనా వైరస్ ఉపిరితిత్తులపై ఎలా ప్రభావం చూపిస్తుందో ముందుగా తెలుసుకుందాం..!

సార్స్, COV2 స్పైక్‌ ప్రోటీన్‌ల ద్వారా కొవిడ్‌ వైరస్‌ లక్షణాలు తెలుసుకోవచ్చునని ఇటీవల పరిశోధనల్లో వెల్లడైంది. కరోనా సోకినా వారి లంగ్స్‌లో మంటగా ఉంటుందని తేల్చారు. కరోనా వైరస్‌ నోరు, ముక్కు, కన్ను, వివిధ మార్గాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలా శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ముందుగా శ్వాస సంబంధిత ప్రాంతంలో చేరుతుంది. ఊపిరితిత్తులతోపాటు గాలి తీసుకునే నాళాన్ని సైతం ఆక్రమిస్తుంది. ఈ సమయంలో శరీరం లో ఇరిటేషన్‌ ఫీలింగ్ కలుగుతుందట.. వైరస్ బాడీలోకి చేరుకునే సమయంలో కొందమందిలో శార్ శరీరం మొత్తం తిమ్మిరి ఎక్కిన ఫీలింగ్ కూడా ఉంటుందట.

అలా శరీరంలోకి చేరిన కరోనా వైరస్ వాయునాళం పై ప్రభావం చూపిస్తుంది. అందుకే, వైరస్‌ మన శరీరంలో చేరగానే కొన్ని రకాల లక్షణాలతో మనం సులభంగా గ్రహించవచ్చు. దీనివల్ల మనం ముందుగానే గ్రహించవచ్చు. గొంతులో చికాకు, పొడిదగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. గాలి తీసుకోవడంలో ఇబ్బంది. నొప ఉండి, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా మారుతుంది. ఛాతి కూడా నొప్పి అనిపించవచ్చని.. యూఎస్‌ వర్జినియా యూనివర్సిటీ వారు తెలిపారు. తాము ఎలుకపై చేసిన ప్రయోగంలో ఈ విషయాలు వెల్లడయ్యాయయని చెప్పారు.

వైరస్‌ బారినపడిన ఊపిరితిత్తులు

మామూలుగా ఉన్న లంగ్స్‌ కంటే వైరస్‌ బారిన పడిన ఊపిరితిత్తుల్లో మ్యాక్రోఫేజెస్‌ అనే ఇమ్యూనిటీ సెల్స్‌తో నిండి ఉంటాయి. శ్వాసనాళాన్నే కాకుండా వాయుమార్పిడి చేందే ప్రాంతాన్ని ఎఫెక్ట్‌ చేస్తుంది. లంగ్స్‌లో ఫ్రైబ్రోబ్లాస్ట్‌ సెల్స్‌ నిండిపోవటాన్ని ఫైబ్రోసిస్‌ అంటారు. కరోనా వైరస్‌ వయస్సు, మగ, ఆడ అనే తేడా లే కుండా అందరిని ఎఫెక్ట్‌ చేస్తుంది. కానీ, వయస్సు ఎక్కువ ఉండి ఇతర వ్యాధులు ఉన్న వారిలో ఈ వైరస్‌ ప్రాణాపాయం కలుగుజేస్తుందని పరిశోధకులు తెలిపారు.

లక్షణాలు కనిపించిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

తరచూ మీ ఆక్సిజన్‌ లెవల్స్‌ను చెక్‌ చేసుకోవాలి. 94-100 మధ్య ఉండాలి. రక్తంలో హెచ్‌బీ లెవల్‌ పరీక్షించుకోవాలి. లంగ్స్‌ కు సంబంధించిన ఎక్సర్‌సైజ్‌ చేయాలి. సైక్లింగ్, స్విమ్మింగ్, వాకింగ్ వంటి ఎక్సర్స్ సైజ్ లు చేయాలి ఎక్కువ అరటిపళ్లు, యాపిల్స్, టోమాటో, ద్రాక్షపండ్లు తినాలి యోగా అలవాటు చేసుకోవాలి. సుఖాసనం, భుజంగాసనం,మత్స్య ఆసనం, పద్మాసనం వంటివి చేయాలి.

Also Read:  ఆ మంత్రులు కూడా ‘బీసీ’లే.. ఈటల విషయంలో రాజకీయాలు తగదు: వేణుగోపాలచారి

 ప్రాణవాయువు కొరత.. 50 గంటల్లో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు.. రోజుకీ 100 సిలిండర్లు..