తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..! అయితే న్యాచ్‌రల్ హెన్నా ట్రై చేయండి.. సమ్మర్‌లో హెయిర్‌కి ప్రొటక్ట్ కూడా..?
Natural Henna : ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికి తెల్లజుట్టు వస్తోంది. ఆధునిక జీవన శైలిలో పోషకాహార లోపం వల్ల
Natural Henna : ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికి తెల్లజుట్టు వస్తోంది. ఆధునిక జీవన శైలిలో పోషకాహార లోపం వల్ల చాలా మందికి తెల్ల జుట్టు వస్తోంది. ఇదే కాకుండా కెమికల్స్ ఉండే షాంపులు వాడటం, ఇతర అలవాట్ల వల్ల కూడా జుట్టు నెరిసిపోతుంది. ఈ సమస్య వల్ల చాలామంది నలుగురిలో కలవలేకపోతున్నారు. ఫంక్షన్లకు వెళ్లలేకపోతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక వెంట్రుకలకు డై వేసుకుంటున్నారు. కానీ ఇది కెమికల్‌తో కూడి ఉంటుంది. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అందుకే న్యాచ్‌రల్‌గా తయారు చేసే హెన్నా వాడటం ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. ఇందుకోసం కొంత సమయం కేటాయించి ఇంట్లోనే రెడీ చేసుకొని వాడాలి. ఇప్పుడు హెన్నా ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం..
ఒక కప్పు నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల సహజసిద్ధంగా తయారు చేసిన గోరింటాకు పౌడర్ ని కలిపి ఎనిమిది గంటలు నానబెట్టండి. రాత్రంతా కూడా ఉంచవచ్చు. మరునాడు పొద్దున్న రెండు టీ స్పూన్ల బ్లాక్ టీ ఆకులని నీటిలో మరిగించి ఆ నీటిని చల్లారనివ్వండి. చల్లారాక ఆ నీటిని హెన్నా పేస్ట్ లో కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడి కలపండి. అన్నీ బాగా కలిసి స్మూత్ పేస్ట్ వచ్చే వరకూ కలపండి. చేతులకి గ్లోవ్స్ వేసుకుని అప్లికేటర్ బ్రష్ తో ఈ పేస్ట్ ని జుట్టుకి పట్టించండి. ఒక గంట అలాగే వదిలేయండి. ఆ తరువాత మైల్డ్, సల్ఫేట్ ఫ్రీ షాంపూ తో హెయిర్ వాష్ చేసుకోండి. ఇలా నెలకి ఒకసారి చేయండి తెల్ల జుట్టు సమస్య ఉండదు.
ఇదిలా ఉంటే మరో పద్దతి కూడా ఉంది.. అరకప్పు ఆలివ్ ఆయిల్ ను బాగా వేడి చేసి అందులో కొన్ని చుక్కల రోజ్ మెరీ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టు లోపలి దాకా పట్టించి అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. తలస్నానం చేసే ప్రతి సారి ఈ విధంగా చేసినట్టయితే జుత్తుకు రంగు వేసుకోవల్సిన అవసరం దాదాపు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్ మరియు రోజ్ మెరీ ఆయిల్ జుట్టు సహజరంగను సంరక్షించడంతో పాటు జుట్టు పొడవుగా పెరగడానికి దోహదం చేస్తాయి.