క్రికెటర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం.. పది మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ.!
టీమిండియా ఆఫ్ స్పిన్నర్.. రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్..
టీమిండియా ఆఫ్ స్పిన్నర్.. రవిచంద్రన్ అశ్విన్ ఇంట్లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. ఇంట్లో ఉన్న పది మందికి వైరస్ సోకిన్నట్లు అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ తెలిపింది. గత కొద్ది రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్న తాము.. కోవిడ్ టెస్టులు చేయించుకోగా.. అందరికీ కరోనా పాజిటివ్ వచ్చిందని ట్వీట్‌లో పేర్కొంది.
పాజిటివ్ వచ్చిన వారిలో.. ఆరుగురు పెద్దవాళ్లతో పాటు నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు వెల్లడించింది ప్రీతి. ఇంట్లోని పిల్లల కారణంగానే వైరస్ అందరికీ వ్యాపించిందన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీలోని అందరూ వేర్వేరు ఇళ్లలో, చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
Feeling ok enough to croak a tiny hi to all of you.6 adults and 4 children ended up testing+ the same week,with our kids being the vehicles of transmission – the core of my family,all down with the virus in different homes/hospitals..Nightmare of a week.1 of 3 parents back home.
— Wear a mask. Take your vaccine. (@prithinarayanan) April 30, 2021
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన అశ్విన్.. గతవారమే మొత్తం సీజన్ నుంచే తప్పుకున్నాడు. కొవిడ్-19పై పోరాడుతున్న తన కుటుంబ సభ్యులు, తన వాళ్లందరికీ మద్దతుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు అశ్విన్.
I would be taking a break from this years IPL from tomorrow. My family and extended family are putting up a fight against #COVID19 and I want to support them during these tough times. I expect to return to play if things go in the right direction. Thank you @DelhiCapitals ??
— Stay home stay safe! Take your vaccine?? (@ashwinravi99) April 25, 2021
Read also:
Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!
కరోనాతో మరణిస్తే రూ. 2 లక్షలు వస్తాయా.? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..!