IPL 2021: కోహ్లీ, మ్యాక్స్ వెల్.. ఆ వెంటనే డివిలియర్స్.. ఏడు బంతుల్లో కథ అడ్డం తిరిగింది.. ఇంతకీ ఎవరా బౌలర్.?

క్రికెట్‌లో ఎవరికి.? ఎప్పుడు.? అదృష్టం వరిస్తుందో తెలియదు. అప్పటి దాకా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని బౌలర్ లేదా బ్యాట్స్ మెన్..

IPL 2021: కోహ్లీ, మ్యాక్స్ వెల్.. ఆ వెంటనే డివిలియర్స్.. ఏడు బంతుల్లో కథ అడ్డం తిరిగింది.. ఇంతకీ ఎవరా బౌలర్.?
Harpreet Bar
Follow us

|

Updated on: May 01, 2021 | 9:34 AM

క్రికెట్‌లో ఎవరికి.? ఎప్పుడు.? అదృష్టం వరిస్తుందో తెలియదు. అప్పటి దాకా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని బౌలర్ లేదా బ్యాట్స్ మెన్ కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు. అలా స్టార్ అయిన ఆటగాడే హర్‌ప్రీత్ బ్రార్‌.  నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఈ 25 ఏళ్ల పంజాబ్ ఫాస్ట్ బౌలర్ అద్భుతం సృష్టించాడు. తన జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించాడు. కేవలం ఏడు బంతుల వ్యవధిలో మొత్తం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, ఏబీ డివిలియర్స్ లాంటి అంతర్జాతీయ మేటి బ్యాట్స్ మెన్ ను తక్కువ పరుగులకే పెవిలియన్ పంపించాడు. 

తన నాలుగో ఐపీఎల్ మ్యాచ్ ఆడిన హర్‌ప్రీత్ బ్రార్.. బౌలింగ్ లో 3 కీలక వికెట్లు పడగొట్టడమే కాకుండా, మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌కు కట్టబెట్టాడు. ఆర్‌సిబికి చెందిన ముగ్గురు సూపర్‌స్టార్‌లను ఒకరి తర్వాత ఒకరిని తక్కువ పరుగులకే పెవిలియన్ కు పంపాడు. 

7 బంతుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ అడ్డం తిరిగింది!

మొదటిగా హర్‌ప్రీత్ బ్రార్.. ఆర్సీబీ కెప్టెన్  విరాట్ కోహ్లీని పెవిలియన్ పంపించగా.. ఆ తర్వాత బంతికే గ్లెన్ మ్యాక్స్ వెల్ ను డకౌట్ చేశాడు. ఇక వెంటనే ఏబీ డివిలియర్స్ ను కూడా తక్కువ పరుగులకే అవుట్ చేయడంతో… కేవలం 7 బంతులలో ఆర్సీబీ కథ పూర్తిగా అడ్డం తిరిగింది. మ్యాచ్ పంజాబ్ చేతుల్లోకి వచ్చింది. నిన్నటి మ్యాచ్ లో హర్‌ప్రీత్ బ్రార్ 4 ఓవర్లు వేసి 19 పరుగులకు మూడు వికెట్లు తీశాడు. 

లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్

ఐపీఎల్ 2019 సీజన్ లో హర్‌ప్రీత్ బ్రార్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. ఇక క్లబ్ మ్యాచ్ లో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు కొట్టినందుకు ఇతడి పేరు మారుమ్రోగింది. బంతితో పాటు బ్యాట్ తో కూడా హర్‌ప్రీత్ బ్రార్ తన అద్భుతమైన ప్రతిభను పలుసార్లు చాటుకున్నాడు. నిన్నటి మ్యాచ్ లో 17 బంతుల్లో అజేయంగా 25 పరుగులు చేశాడు. పంజాబ్ టీమ్ గౌరవప్రదమైన స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 

Read also:

Viral: నల్ల త్రాచు, ముంగీస మధ్య యుద్ధం.. వైరల్ వీడియో.. చివరికి ఎవరు గెలిచారంటే.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలు ఫిక్స్..