AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొవిడ్ లక్షణాలలో ఆ రెండు చాలా డేంజరట..! కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట..? తెలుసుకోండి..

Covid Patients : దేశంలో రోజులు గడిచే కొద్ది కరోనా మహమ్మారి తీవ్రమవుతోంది. బెడ్స్, ఆక్సిజన్, మందులు దొరక్కా ప్రజలు ఇబ్బందులు

కొవిడ్ లక్షణాలలో ఆ రెండు చాలా డేంజరట..! కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట..? తెలుసుకోండి..
Abdominal Pain
uppula Raju
|

Updated on: May 01, 2021 | 2:01 PM

Share

Covid Patients : దేశంలో రోజులు గడిచే కొద్ది కరోనా మహమ్మారి తీవ్రమవుతోంది. బెడ్స్, ఆక్సిజన్, మందులు దొరక్కా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల మెరుగైన చికిత్స కోసం పేషెంట్లు ఆసుపత్రికి రాకుండా ఇంటి వద్దే ఐసోలేషన్‌లో ఉండమని కోరుతున్నారు. పేషెంట్ సీరియస్‌గా ఉంటే మాత్రం ఆస్పత్రకి తరలించడని సూచిస్తున్నారు. కొవిడ్ సోకిన తర్వాత చాలామంది బలహీనతతో పాటు అనేక జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా వైరస్ శ్వాసకోశ వ్యాధి అయినప్పటికీ ఇది మీ శరీరంలోని ఇతర భాగాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలోని ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే మొదటగా ఊపిరి తీసుకోవడం నెమ్మదిస్తుంది. తర్వాత పొడిదగ్గు ప్రారంభమవుతోంది.

1. పరిశోధన ప్రకారం.. ప్రతి ఐదుగురు కరోనా బాధితులలో ఒక్కరు కడుపు నొప్పి, విరేచనాలతో బాధపడుతున్నారు. మిగతా వారికంటే ఈ లక్షణాలతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

2. రుచి, వాసన కోల్పోవడం, జీర్ణ సమస్యలు, ఆకలి లేకపోవడం జరుగుతుంది. చైనాలో జరిపిన పరిశోధనల ప్రకారం.. 80 శాతం మంది రోగులకు ఆకలి కావడం లేదని తేలింది. ఇది కాకుండా వికారం, వాంతులతో బాధపడుతున్నారు.

3. కరోనా వైరస్ రోగి కాలేయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హెపటాలజీ చీఫ్ డైరెక్టర్ గురుగ్రామ్ అవ్నిష్ సేథ్ ఇలా పేర్కొన్నాడు. కరోనా వల్ల కాలేయ ఎంజైమ్‌ల ఎత్తు పెరుగుతుందని చెప్పాడు.

4. కరోనా రోగులలో 19 శాతం మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ఎంజైమ్‌లైన అలనైన్ అమినోట్రాన్స్‌ఫేరేస్ (ఎఎల్‌టి), అస్పార్టేట్ అమినోట్రాన్స్‌ఫేరేస్ (ఎఎస్‌టి) అసాధారణ స్థాయిలో పెరుగుతున్నట్లు కనుగొన్నారు. సీరం బిలిరుబిన్, గామా-గ్లూటామిల్ ట్రాన్స్‌ఫేరేస్ (జిజిటి) లలో తేలికపాటి పెరుగుదల సంభవిస్తుంది. అయితే ఈ కాలేయ సమస్యలు తాత్కాలికంగా ఉంటాయని తెలిపారు.

మరీ కఠిన ఆంక్షలు, ఇండియా నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లకు 5 ఏళ్ళ జైలు శిక్ష, జరిమానా, మానవ హక్కుల సంఘాల నిరసన

Sangam Dairy Case: సంగం డెయిరీ కేసులో విచారణ వేగవంతం.. ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి తీసుకున్న ఏసీబీ అధికారులు