AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ కలలో ఈ వస్తువులు, పక్షులు, జంతువులు కనిపిస్తున్నాయా ? అయితే మీరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..

సాధారణంగా మనం దాదాపు 6 నుంచి 8 గంటల నిద్రించాలి అంటుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో 4 గంటలకు మించి నిద్రపోవడం లేదు చాలా మంది.

మీ కలలో ఈ వస్తువులు, పక్షులు, జంతువులు కనిపిస్తున్నాయా ? అయితే మీరు ఈ విషయాలను తప్పక తెలుసుకోవాల్సిందే..
Dreams
Rajitha Chanti
|

Updated on: May 01, 2021 | 1:52 PM

Share

సాధారణంగా మనం దాదాపు 6 నుంచి 8 గంటల నిద్రించాలి అంటుంటారు. అయితే ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో 4 గంటలకు మించి నిద్రపోవడం లేదు చాలా మంది. ఇక రాత్రిళ్లు నిద్రిస్తున్న సమయంలో చాలామందికి రకారకాల కలలు వస్తుంటాయి. కొన్ని సందర్బాల్లో మనం రోజాంతా ఒకే పని చేసినా.. లేదా ఒకే విషయం గురించి ఆలోచించినా వాటికి సంబంధించిన విషయాలే తిరిగి కలలోకి వస్తుంటాయి. అంతేకాదు.. కొందరు నిద్రలో మాటలు కూడా మాట్లాడేస్తుంటారు. అయితే మనకు కలలో కనిపించే వస్తువులు, పక్షులు, జంతువులు, లేదా జరిగిన సంఘటనలు మరుసటి రోజూ ఉదయం కొంతవరకు గుర్తుకువస్తుంటాయి. అయితే అలా కలలో కనిపించిన వాటికి మంచి, చెడు రకాలు ఉంటాయని.. అవి మన ఆరోగ్యంపైనే కాకుండా.. వ్యక్తిగత జీవితంలోనూ మంచి చేయవచ్చు.. లేదా చేడు చేయవచ్చు అంటుంటారు. అయితే ఇందులో కలలో ఏ విషయాలు.. ఏ వస్తువులు, జంతువులు కనిపిస్తే మంచి జరుగుతుందో తెలుసుకుందామా..

చిలుక..

కలల గ్రంథం ప్రకారం.. కలలో చిలుక వస్తే అది శుభమే అంటా.. చిలుకను చూడడం ద్వారా మీకు త్వరలోనే డబ్బు ప్రయోజనం ఉంటుందని విశ్వసిస్తుంటారు.

ఆత్మహత్య చేసుకోవడం..

మీ కలలో ఏవరైనా లేదా మీరే ఆత్మహత్య చేసుకోవడం వస్తే.. వెంటనే ఉలిక్కిపడిపోతారు. వెంటనే అది అపశకునం అని భావిస్తుంటారు. కానీ అది అసలు అఫశకునం కాదంట. అలా కలలు రావడం శుభమే అంటా.

నిర్మాణ పనులు..

మీ కలలో ఏదైనా బిల్డింగ్ నిర్మించడం లేదా ఏదైనా వంతెనా నిర్మించడం లాంటివి వస్తే.. దాని అర్థం.. మీరు మీ భవిష్యత్తులో చేసే పనిలో విజయం సాధించబోతున్నారని అర్థం.

మీకు మీరే పేదవారిగా కనిపించడం..

మీ కలలో మీరే పేదవారిగా కనిపిస్తే అసలు చింతించాల్సిన పనిలేదు. కలల గ్రంథం ప్రకారం మీఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని అర్థం. ఆ కలలు వస్తే మీరు ఆర్థికంగా వృద్ధి చెందుతారు.

బల్లి కనిపించడం..

కలలో బల్లి కనిపిస్తే శుభమే. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారని అర్థం.

పాము కనిపించడం..

కలలో పాము కనిపిస్తే.. సర్పదోషం ఉందని భావిస్తుంటారు. కానీ కలల గ్రంథం ప్రకారం పామును కనిపిస్తే శుభమే. మీరు విజయాలను సాధించబోతున్నారట.

గులాబీలు కనిపించడం..

కలలో గులాబీలు కనిపిస్తే.. పువ్వు చూడటం చాలా పవిత్రమైంది. అలాగే మీ జీవితంలోని గమ్యాన్ని చేరుకోబోతున్నారని అర్థం.

Also Read: కరోనా నుంచి కోలుకున్నారా ? అయితే ఈ డ్రింక్ తాగాల్సిందే.. బలహీనతను తగ్గించడమే కాకుండా ఆకలిని పెంచుతుంది..

Hydrated Fruits: వేసవిలో ఈ పండ్లు తింటే.. మీ బాడీ అస్సలే డీహైడ్రేషన్ కాదు.. అవేంటంటే..?