కరోనా నుంచి కోలుకున్నారా ? అయితే ఈ డ్రింక్ తాగాల్సిందే.. బలహీనతను తగ్గించడమే కాకుండా ఆకలిని పెంచుతుంది..
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో రోజుకు లక్షల్లో కేసులు రాగా.. వేలల్లో మరణాలు సంబవిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో రోజుకు లక్షల్లో కేసులు రాగా.. వేలల్లో మరణాలు సంబవిస్తున్నాయి. అయితే ఈ మహమ్మారి నుంచి కోలుకొని తిరిగి మాములు స్థితికి వచ్చిన వారి సంఖ్య కూడా బాగానే ఉంది. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత వారు బలహీనంగా ఉండడం, అలసటకు గురవడం.. ఆకలి వేయకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోంటున్నారట. డాక్టర్ల సలహాతో ప్రోటీన్ ఫుడ్ సూచనలను పాటిస్తున్నా కానీ.. చాలా మంది క్షణాల్లో నీరసంగా మారిపోతుంటారు. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత మిల్క్ గోర్డ్, క్యారెట్, దుంప వంటి వాటిని తినడం మంచిది, తద్వారా శరీరానికి బలం వస్తుంది. కానీ నోటికి రుచి లభించదు. అయితే నోటికి రుచి అందించడమే కాకుండా.. ఆకలిని పెంచేందుకు కూడా ఒక డ్రింక్ ఉంది. అదెంటో చూసేద్దామా.
కావల్సిన పదార్థాలు..
క్యారట్, మిల్క్ గోర్డ్, బీట్ రూట్, టమోటా, దానిమ్మ. సిట్రస్ లేదా ఆరెంజ్, అల్లం ఆపిల్..
తయారు విధానం..
క్యారట్, మిల్క్ గోర్డ్, బీట్‌రూట్, టమోటా, దానిమ్మ, సిట్రస్ లేదా ఆరెంజ్, అల్లం మరియు ఆపిల్ వీటన్నింటిని కలిపి మిక్సి పట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమానికి నిమ్మకాయ, నల్ల ఉప్పు, మిరియాలు కలిపి మిక్సి పట్టాలి. ఆ తర్వాత దీనిని తీసి గ్లాసులోకి తీసుకోని తాగాలి. ఇలా కనీసం 10 రోజులు చేయడం వలన శరీరానికి కావల్సిన ఐరన్, ప్రోటీన్స్ తోపాటు బలహీనతను తగ్గిస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే రోజూ రాత్రి ఎండు ద్రాక్ష, బాదం, వాల్నట్స్, అత్తిచెట్లు నాన బెట్టి.. ఉదయం లేవగానే పరిగడుపున తినడం మంచిది. ఇవి తిన్న తర్వాత అరగంట వరకు ఏం తినకూడదు. ఇలా చేయడం వలన శరీరంలోని బలహీనతను తగ్గిస్తుంది.
Also Read: కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఆ బ్యాంక్.. మే 1 నుంచి అమలులోకి కొత్త రూల్స్.. అవెంటంటే..
పాత కాయిన్స్కు డిమాండ్.. ఈ కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే… ఎలాగో తెలుసా..