Hydrated Fruits: వేసవిలో ఈ పండ్లు తింటే.. మీ బాడీ అస్సలే డీహైడ్రేషన్ కాదు.. అవేంటంటే..?
Health Benefits Of Hydrated Fruits: వేసవి కాలంలో శరీరానికి తగినంత నీరు అందకపోతే.. తరచూ డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. ఎండదెబ్బ బారిన కూడా పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు శరీరాన్ని జాగ్రత్తగా
Updated on: Apr 29, 2021 | 3:58 PM

Health Benefits Of Hydrated Fruits: వేసవి కాలంలో శరీరానికి తగినంత నీరు అందకపోతే.. తరచూ డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. ఎండదెబ్బ బారిన కూడా పడతారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. దీనికోసం ఇలాంటి పండ్లను తింటే.. మీ శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కీర దోస: కీర దోసకాయలో విటమిన్ కె, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో నీటి శాతాన్ని బాగా పెంచుతుంది. దీనిని తినడం వల్ల.. మీ చర్మం కూడా ఆరోగ్యవంతంగా మారుతుంది.

పుచ్చకాయ: పుచ్చకాయ మీ శరీరంలో నీటి శాతాన్ని అమాంతం పెంచుతుంది. ఇందులో 90 శాతం నీరే ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంవంతంగా ఉంచడంతోపాటు హైడ్రేట్ గా ఉంచుతుంది.

మామిడికాయ: వేసవిలో మామిడికాయలు తినడం కూడా మంచిదే. ఈ పండు కూడా మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సాయపడుతుంది. కానీ అతిగా తింటే వేడి చేస్తుంది.

Health Benefits of Orange

టామాట: టమాటాల్లో విటమిన్ ఎ, బి 2 వంటి పోషకాలు అత్యధికంగా ఉంటాయి. వేసవి కాలంలో పచ్చిగా తినడం వల్ల శరీరానికి చాలా పోషకాలు లభిస్తాయి. నీటిశాతం కూడా పెరుగుతుంది.





























