Mahabharat: మహాభారతంలోని కొన్ని పాత్రలు మనజీవితంలో ఎలా జీవించాలో.. జీవించకూడదో ఉదాహరణగా నిలుస్తాయి.. అవి ఏమిటంటే..!

భారతీయుల ప్రాచీన పురాణ గ్రంధాల్లో మహాభారతం ఒకటి. పంచమవేదంగా ప్రసిద్ధిగాంచింది. అయితే ప్రస్తుతం ఆధునికత పేరుతో కేవలం మహాభారతాన్ని ఓ మత గ్రంధం గానో, దేవుడు పుస్తకంగానో చూస్తున్నాం. కానీ నిజానికి ఇప్పటి రోజులకీ సరిపడేటట్టు సామాజిక జీవన శైలిని ఎలా మలచుకోవాలో మనకు మహాభారతం చెప్తుంది. మహాభారతంలోని పాత్రలు మన నేటి జీవన విధానానికి సజీవ సాక్ష్యాలు. మహా భారతం మనకి మన దేశ చరిత్రని చెప్పటంతో పాటు జీవితంలో విజయం సాధించాలంటే ఎలా ఉండాలో కూడా చెబుతుంది...

  • Surya Kala
  • Publish Date - 2:43 pm, Sat, 1 May 21
1/8
Dhritarashtra
ద్రుతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్దాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు. అదే ద్రుతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంత వరకూ వెళ్ళేది కాదేమో. ఎవరి మీద అయిన అతి ప్రేమ, అతి నమ్మకం నాశనానికి, మోసానికి దారితీస్తాయి.
2/8
Gandhari
కౌరవుల తల్లి అయిన గాంధారీ కి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. రాజ్యాన్ని బిడ్డలకి సమంగా పంచటమూ వారి బాగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచటమూ కూడా చాలా కష్టం. అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం, అధికమైన రాజ్యకాంక్ష కారణంగా కౌరవులు నాశనం అయ్యారు.
3/8
Shakuni
శకుని... పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి, వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి వారు జీవితంలో చాలా మంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు. అలాంటి వారి చెడు సలహాలని దూరం పెట్టాలి.
4/8
Karna
కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన, ధర్మాలకి పెట్టింది పేరు. కాని సమయాన్ని బట్టి నిర్ణయాలను తీసుకోకపోవడం వలన చెడు (కౌరవుల) వైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని, సమయాన్ని బట్టి మార్గాన్ని ఎంచుకోవాలి. చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయవచ్చని కర్ణుడు ఉదాహరణగా నిలుస్తాడు.
5/8
Arjunudu
అర్జునుడు తన జీవితం ఆసాంతం విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు. ద్రోణాచార్యుల వారి నుండీ యుద్ద శాస్త్రం, దైవ సంబందమైన ఆయుధాల వాడకం ఇంద్రుడు ద్వారా, మహదేవుడి నుండి పాశుపతాస్త్రం. యుధిష్టరుడు, కృష్ణుడి నుండి మరెన్నో రాజ నీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించటమే అర్జునుడికి ఓ ప్రత్యెక స్థానం దక్కింది. నిత్యం ఏదో ఒకటి నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు.
6/8
Draupadi
కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామ రూపాలు లేకుండా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం వాళ్ళని అవమాన పరచడం అనేది చాలా పెద్ద పాపం.
7/8
Abhimanyudu
పద్మవ్యూహం లోనికే ప్రవేశించటమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానమతో అభిమన్య్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు. ఏ పనిని అయిన పూర్తిగా తెలుసుకున్నకే మొదలుపెట్టాలి. అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది.
8/8
Eklavya
చాలా మందికి తెలిసినంత వరకూ అర్జునుడే ప్రపంచం మొత్తంలో అతిపెద్ద విలికాడు. కానీ కుటిల రాజకీయాల వలన తన వేలుని కోల్పోయిన ఏకలవ్యుడు అర్జునుడిని మించిన వీరుడు. నేరుగా గురుశిక్షణ లేకున్నా అతనికి ఉన్న ఆసక్తే అర్జునుడి కన్నా గొప్ప వీరుణ్ణి చేసింది. కావున ఏదైనా సాధించాలంటే ముందుగా మనకు దాని పైన అమితమైన ఆసక్తి ఉండాలి లేకపోతే సాధించలేము.