Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID Care Center: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఏబీవీపీ కార్యకర్తల హంగామా..విమర్శల వెల్లువ..వైరల్ గా మారిన వీడియో

కరోనా రెండో వేవ్ భారతావనిని కుదిపేస్తోంది. వందలాది మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఆసుపత్రులలో వైద్య సహాయం పొందుతున్నారు. కోవిడ్ వార్డుల్లో వారు ఒంటరిగా తమ పరిస్థితికి బాధపడుతూ ఉన్నారు.

COVID Care Center: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఏబీవీపీ కార్యకర్తల హంగామా..విమర్శల వెల్లువ..వైరల్ గా మారిన వీడియో
Abvp
Follow us
KVD Varma

|

Updated on: Apr 30, 2021 | 6:26 PM

COVID Care Center: కరోనా రెండో వేవ్ భారతావనిని కుదిపేస్తోంది. వందలాది మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్ ఆసుపత్రులలో వైద్య సహాయం పొందుతున్నారు. కోవిడ్ వార్డుల్లో వారు ఒంటరిగా తమ పరిస్థితికి బాధపడుతూ ఉన్నారు. వారిని పలకరించే వారు లేని స్థితిలో వారిలో మానసికంగా ఎంతో బాధ కరోనా కంటె ఎక్కువగా కలుగుతూ వస్తోంది. ఇటువంటి సమయంలో వైద్య సిబ్బంది వారిని సంతోషంగా ఉంచడానికి తాము చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తూ వస్తున్నారు. మరోవైపు కొంతమంది వారికి అవసరమైన సహాయాన్ని అందించడానికి తమ వంతుగా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే, అలా సహాయం చేయాలనుకున్న వారు నిబంధనలు పాటించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్లోని డూన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ COVID-19 వార్డ్ లోపల పీపీఈ కిట్లతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ అఖిల్ భారతీయ విద్యా పరిషత్ (ఏబీవీపీ) సభ్యులు కోవిడ్ పేషెంట్లకు చేస్తున్న సహాయం వీడియో వైరల్ అయ్యింది. అక్కడ ఏబీవీపీ సభ్యులు.. రోగుల ఆక్సిజన్ పైపులను తొలగించి, వారికి పళ్ళ రసాలను అందిస్తున్నారు ఆ వీడియోలో. ఏబీవీపీ సభ్యులు ధరించిన పీపీఈ కిట్లపై ఏబీవీపీ అనే అక్షరాలు మెరుస్తున్నాయి.

నిజానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) మార్గదర్శకాల ప్రకారం, విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందికి మాత్రమే COVID-19 వార్డులోకి ప్రవేశించడానికి అనుమతి ఉంది. కానీ, ఇతరులు ఎవ్వరూ కోవిడ్ వార్డులోకి వెళ్ళే అనుమతి ఉండదు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వివాదాస్పదం అయింది.

ఏబీవీపీ ఇలా చేయాడాన్ని అక్కడి కాంగ్రెస్ ప్రతినిధి తీవ్రంగా విమర్శించారు. “ఏబీవీపీ యొక్క ఈ చర్య చాలా అభ్యంతరకరమైనది. ఒకవేళ ఏబీవీపీని అధికారికంగా అనుమతించినట్లయితే, ఇతర వ్యక్తులు కూడా వరుసలో మేమూ వస్తామని నిలబడతారు. ఇది ఆసుపత్రి ప్రాంగణంలో గందరగోళానికి దారితీస్తుంది. ప్రభుత్వం బాధ్యులను తెలుసుకుని మందలించాలి ”. అని గరిమా అంటున్నారు.

ఈ విషయంపై డూన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ అశుతోష్ సయానా మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్వహణకు సహాయం చేయడానికి ఏబీవీపీ అనుమతి తీసుకుంది. అయితే, కోవిడ్ -19 వార్డులోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు. అని చెప్పారు. ఏబీవీపీ సభ్యులు వార్డులోకి ఎలా ప్రవేశించారో దర్యాప్తు చేస్తామని ఆయన వెల్లడించారు.

ఆసుపత్రి ప్రాంగణంలో ఆర్డర్‌ను నిర్వహించడానికి పరిపాలనకు సహాయం చేయడానికి ఏబీవీపీ అనుమతి కోరినట్లు సయానా చెబుతున్న సమాచారం. అంతేకానీ, అధిక-ప్రమాదం ఉన్న COVID-19 వార్డులోకి ప్రవేశించడానికి సంస్థను అనుమతించలేదు. అని అయన స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ కెసి పంత్ ఏబీవీపీ కార్యకర్తలు ఆ ప్రాంగణంలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు.

ఏబీవీపీ కార్యకర్తలు కోవిడ్ వార్డులో ఉన్న వీడియో ఇదే..

Also Read: Viral News: అస‌లైన హీరో ఇత‌డేగా.. మ‌న‌సు చ‌లించి అంబులెన్స్ డ్రైవర్​గా మారిన నటుడు..

Special Trains: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. పలు రైళ్లు పొడిగింపు.. మరికొన్ని సర్వీసులు రద్దు..!