We are With India: మీ వెంటే మేమంతా.. కల్లోల సమయంలో భారత ప్రజలకు ఆఫ్ఘాన్ ప్రజల సంఘీభావం!
కరోనా రెండో వేవ్ తన ప్రతాపం చూపిస్తున్న వేళలో ప్రపంచం మొత్తం భారతావనికి అండగా నిలుస్తోంది. పలు దేశాలు తమకు చేతనైన సహకారాన్ని వేగంగా అందిస్తున్నాయి.
We are With India: కరోనా రెండో వేవ్ తన ప్రతాపం చూపిస్తున్న వేళలో ప్రపంచం మొత్తం భారతావనికి అండగా నిలుస్తోంది. పలు దేశాలు తమకు చేతనైన సహకారాన్ని వేగంగా అందిస్తున్నాయి. కొన్ని దేశాల ప్రజలు భారతదేశ ప్రజలకు మేము అండగా ఉన్నామని చెబుతున్నారు. ఇంటర్ నెట్ లో పలు దేశాల ప్రజల నుంచి భారతావనికి మద్దతు పెరుగుతోంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు తమ సంఘీభావాన్ని తెలిపే ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేస్తున్న ఒక వీడియోలో..చాలా మంది ఆఫ్ఘన్లు భారతీయుల పట్ల తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. అలాగే తమ ప్రార్థనలను వినిపిస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులు ఒంటరిగా లేరని వారు భరోసా ఇచ్చారు. మానవ హక్కుల కార్యకర్తల నుంచి అథ్లెట్లు అలాగే, దుకాణదారుల వరకు, డజన్ల కొద్దీ ఆఫ్ఘన్ ప్రజలు ఒక వీడియో సందేశంలో తమ హృదయపూర్వక మద్దతును వ్యక్తం చేశారు. అల్లకల్లోలంగా ఉన్న సమయాల్లో భారతదేశం ఒక రోజులో దాదాపు 3.5 లక్షల మంది రోజూ కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఆఫ్ఘన్ ప్రజలు “మీరు మా హృదయాల్లో ఉన్నారు”, “మీరు మా ప్రార్థనలలో ఉన్నారు” వంటి సందేశాలతో ప్లకార్డులు పట్టుకొని, భారతీయుల “బలం ప్రకాశిస్తుంది” అని వారు హామీ ఇస్తున్నారు. “మీ స్థిరమైన బలంతో, ఈ క్లిష్ట సమయం అధిగమించబడుతుంది” అని వారు హృదయపూర్వక వీడియోలో చెప్పారు. “ఈ క్లిష్ట సమయాల్లో ఆఫ్ఘన్లు మీతో ఉన్నారు” అని నొక్కిచెప్పడంతో, వీడియో కిక్‌స్టార్ట్ చేసింది.
ఈ పరీక్షా సమయాల్లో భారతీయులకు తమ మద్దతును ఇవ్వడానికి ఆఫ్ఘన్లు మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా ఇంతకు ముందు సోషల్ మీడియాలో ఇదే విధమైన ప్రచారం చేయడం గమనార్హం. ఆఫ్ఘన్లు చేసిన ప్రచార వీడియో ఇక్కడ మీరు చూడొచ్చు..
Difficult times for India. Afghans are with you at these difficult times. #WeAreWithYouIndia pic.twitter.com/kwJjqcaK3p
— Saad Mohseni (@saadmohseni) April 29, 2021
Also Read: Viral News: కోవిడ్ రోగుల కోసం నర్సు పాట.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Village in Sand: దెయ్యం భయంతో ఊరంతా ఖాళీ..ఇసుక దెబ్బకు ఇళ్ళన్నీ మునిగిపోయాయి..ఊరంతా ‘ఇసుకే’సింది!