Kerala Police: కోవిడ్ నిబంధనలు పాప్యులర్ ట్యూన్ పాటలో..పోలీసుల డ్యాన్స్ తో.. కేరళ పోలీసుల వీడియో వైరల్!

కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళలో ప్రజల్లో కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాలను రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Kerala Police: కోవిడ్ నిబంధనలు పాప్యులర్ ట్యూన్ పాటలో..పోలీసుల డ్యాన్స్ తో.. కేరళ పోలీసుల వీడియో వైరల్!
Police Dance
Follow us
KVD Varma

|

Updated on: Apr 30, 2021 | 5:08 PM

Kerala Police: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళలో ప్రజల్లో కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాలను రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో అవగాహన కలిగిస్తే.. కరోనా నియంత్రించగలిగే జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకూ కరోనాపై యుద్ధం గెలిచినట్లే. అందుకే, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని పదే పదే చెబుతూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఇక కేరళ పోలీసులు ఇప్పుడు మరో ప్రయత్నం దీనికోసం చేశారు. కోవిడ్ -19 మహమ్మారి గురించి అవగాహన కల్పించడానికి కేరళ పోలీసులు ఇటీవల ఒక డ్యాన్స్ వీడియోను విడుదల చేశారు. ఇది ఇప్పుడు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా భాగస్వామ్యం చేయబడుతోంది.

కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన మీడియా సెంటర్ రూపొందించిన ఈ వీడియోలో, తొమ్మిది మంది పోలీసు అధికారులు యూనిఫాంలో ఉన్నారు, కోవిడ్ -19 వైరస్ నివారణ చర్యల గురించి ఒక పాటకు వారు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పాట పాపులర్ సూపర్ హిట్ తమిళ పాట “ఎంజాయ్ ఎంజామి” ట్యూన్ లో ఉంది. ఏదేమైనా, ముసుగును సరిగ్గా ధరించడం, సామాజిక దూరాన్ని నిర్వహించడం అలాగే హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడటానికి ఈ పాటలో సాహిత్యం చక్కగా రాశారు. మంచి సంగీతం.. దానికి మించిన సాహిత్యం.. దీనికి పోలీసుల డ్యాన్స్ చక్కగా కుదిరిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను మీరూ ఇక్కడ చూడొచ్చు..

కేరళ పోలీసులు ఈ విధంగా చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. పోయిన సంవత్సరం కూడా కరోనా విరుచుకుపడుతున్న వేళలో కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ వాషింగ్ డ్యాన్స్, చేతులు తరుచు కడుక్కోవాలనే అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి అలాగే, చేతులు కడుక్కోవడం ప్రాముఖ్యతను హైలైట్ చేసే ప్రయత్నం వైరల్ అయ్యింది. అప్పుడు వారు చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా పాప్యులర్ అయింది. ఇప్పుడు కూడా ఈ వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.

మరోవైపు కేరళలో కరోనా మహమ్మారి విరుచుకు పడుతూనే ఉంది. బుధవారం కేరళలో మొత్తం 1,38,190 నమూనాలను పరీక్షిస్తే, వాటిలో 35,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది కేరళలో ఇప్పటివరకూ రికార్డు స్థాయి.

Also Read: Blowing in the Wind: అప్పటి పాట..ఆ చిన్నారి గాయకుడు పాడితే..ఇప్పటికీ కొత్తగా..నెటిజన్లు ఫిదా!

కరోనా అలర్ట్..! ఒక డోసు టీకా సరిపోతుంది..! రెండు డోసులు అవసరం లేదు..? తెలుసుకోండి..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..