AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీ తమిళనాడు టూర్‌లో హైడ్రామా.. డీఎంకే, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు..

ప్రధాని మోదీ చెన్నై పర్యటనలో హైడ్రామా చోటు చేసుకుంది. 11 అభివృద్ది కార్యక్రమాలను తమిళనాడులో ప్రారంభిస్తున్నారు మోదీ. అయితే మోదీ సభకు వేదికైన నెహ్రూ ‌ ఇండోర్‌ స్టేడియంలో అటు డీఎంకే మద్దతుదారులు , ఇటు బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

PM Modi: ప్రధాని మోదీ తమిళనాడు టూర్‌లో హైడ్రామా.. డీఎంకే, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు..
Pm Modi Chennai
Sanjay Kasula
|

Updated on: May 26, 2022 | 7:04 PM

Share

తెలంగాణ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) తమిళనాడు రాజధాని చెన్నై(chennai) చేరుకున్నారు. చెన్నై చేరుకున్న ప్రధాని మోదీకి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్ ఆర్ ఎన్ రవితోపాటు తమిళనాడు మంత్రులు తురైమురుగన్, కేఎన్ నెహ్రూ, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిసామి స్వాగతం పలికారు. విమానాశ్రయంలో హెలికాప్టర్‌లో అడయార్‌లోని ఐఎన్‌ఎస్ నేవల్ బేస్‌కు చేరుకున్న ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమంలో పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. అనంతరం.. ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ప్రధాని రోడ్‌షోకు వేలాది మంది తరలివచ్చారు. అనంతరం చెన్నైలో ఈరోజు రూ.31 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. చెన్నైలో PM మోడీ ప్రారంభించిన లేదా శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనితో పాటు, ఇది అనేక రంగాలపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఉపాధి అవకాశాలను సృష్టించడంలో కూడా సహాయపడుతుంది.

ప్రధాని మోదీ చెన్నై పర్యటనలో హైడ్రామా చోటు చేసుకుంది. 11 అభివృద్ది కార్యక్రమాలను తమిళనాడులో ప్రారంభిస్తున్నారు మోదీ. అయితే మోదీ సభకు వేదికైన నెహ్రూ ‌ ఇండోర్‌ స్టేడియంలో అటు డీఎంకే మద్దతుదారులు , ఇటు బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాని మోదీ జిందాబాద్‌ అని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయగా .. దళపతి జిందాబాద్‌ అంటూ డీఎంకే కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో పర్యటన ముగించుకుని చెన్నై చేరుకున్నారు ప్రధాని మోదీ. అయితే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి సీఎం స్టాలిన్‌ రాలేదు. మంత్రి దురైమురుగన్‌ ప్రధానికి స్వాగతం పలింకారు. చెన్నైలో మొత్తం 11 అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అయితే అంతకుముందే నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో హైడ్రామా చోటు చేసుకుంది. అటు డిఎంకే, ఇటు బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

Follow Us