PM Modi: 2024 టార్గెట్‌గా బీజేపీ మెగా ప్లాన్‌.. దేశవ్యాప్తంగా 144 లోక్‌సభ స్థానాలపై ఫోకస్..

PM Modi: 2024 టార్గెట్‌గా బీజేపీ మెగా ప్లాన్‌.. దేశవ్యాప్తంగా 144 లోక్‌సభ స్థానాలపై ఫోకస్..
Modi Government

8 Years of Modi Government: మే 26వ తేదీన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ ఎనిమిదేళ్లు సంబరాలు చేసుకోవడంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సన్నాహాలు ప్రారంభించింది.

Sanjay Kasula

| Edited By: Ravi Kiran

May 27, 2022 | 10:07 AM

మే 26వ తేదీన కేంద్రంలోని  మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ ఎనిమిదేళ్లు సంబరాలు చేసుకోవడంతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ సన్నాహాలు ప్రారంభించింది. 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా తమ తమ నియోజకవర్గాల్లో బలహీనమైన బూత్‌లను బలోపేతం చేయాలని భారతీయ జనతా పార్టీ (BJP) బుధవారం తన ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించింది. ప్రభుత్వం ఏర్పాటై 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ దక్షిణ భారతదేశంలో పర్యటించనున్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి దేశంలో ఎన్నో సంస్కరణలకు, మరెన్నో ఆవిష్కరణలకు నాంది పలికారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ప్రధాని మోడీ.. దేశ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం, అన్ని వర్గాల భద్రత, సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో గతవారం జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం మరో భారీ లక్ష్యం పెట్టుకుందా? ఇందుకు 2024 టార్గెట్‌గా పెట్టుకుందా? ఇంతకీ మోదీ సర్కారు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఎలాంటి లక్ష్య సాధనతో ముందుకు వెళ్తోంది. మోదీ సాహసోపేత నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారాయి.

మరోవైపు మోడీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కూడా మెగా ప్లాన్‌ సిద్ధం చేసింది. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మెగా ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 144 లోక్‌సభ స్థానాలను బీజేపీ గుర్తించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన 144 స్థానాలు ఇవి. ఈ 144 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి మంత్రి 3 రోజుల పాటు మకాం వేయనున్నారు. ఈ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ స్థానాన్ని బలోపేతం చేసేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ కొత్త నేతలకు బాధ్యతలు అప్పగించనుంది.

2024కి ప్రత్యేక సన్నాహాలు, మరోవైపు మోడీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ కూడా మెగా ప్లాన్‌ సిద్ధం చేసింది. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ మెగా ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 144 లోక్‌సభ స్థానాలను బీజేపీ గుర్తించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన 144 స్థానాలు ఇవి. ఈ 144 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి మంత్రి 3 రోజుల పాటు మకాం వేయనున్నారు. ఈ లోక్‌సభ స్థానాల్లో బీజేపీ స్థానాన్ని బలోపేతం చేసేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ కొత్త నేతలకు బాధ్యతలు అప్పగించనుంది.

కేంద్ర మంత్రి రాష్ట్రాలకు

బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా బుధవారం మంత్రులతో సమావేశమయ్యారు. మే 30- జూన్ 15 మధ్య నిర్వహించే కసరత్తు .. పర్యటనల ప్రణాళికను ఖరారు చేయడంపై చర్చించారు. బిజెపి ఈ ప్రచారం సందర్భంగా, ధర్మేంద్ర ప్రధాన్, స్మృతి ఇరానీ,జ్యోతిరాదిత్య సింధియాతో సహా అర డజను మంది కేంద్ర మంత్రులు పశ్చిమ బెంగాల్‌ను సందర్శించనున్నారు. ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మరికొందరు కేంద్ర మంత్రులతో కలిసి పంజాబ్‌ను సందర్శించనున్నారు. కేంద్రమంత్రి తనకు కేటాయించిన రాష్ట్రాల్లో రెండు మూడు రోజులు గడపనున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఆయన మీడియా సమావేశాలు నిర్వహించనున్నారు. మే 30 నుంచి జూన్ 15 వరకు ‘సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమం’ అనే థీమ్‌పై బిజెపి మోడీ ప్రభుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది.

తెలంగాణ, ఏపీపై బీజేపీ ఫోకస్‌..

అనుకున్నట్లే ఉత్తరప్రదేశ్‌ను మరోసారి నిలబెట్టుకుంది BJP. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే UPలో BJP దూసుకెళ్లింది. 2017 మాదిరిగానే ఈసారి కూడా BJP తనకు ఎదురులేదని నిరూపించింది. స్పష్టమైన మెజారిటీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు CM యోగి. ప్రధాని మోదీ, అమిత్‌షాల వ్యూహాం మరోసారి ఫలించింది. మరి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలుగురాష్ట్రాలపై ప్రభావం చూపుతాయా? మోదీ, అమిత్‌షా ఆపరేషన్ తెలంగాణ మొదలెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. CM KCR జాతీయ రాజకీయాలవైపు పావులు కదపడం కూడా రాష్ట్రంలో BJPకి కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.

CM KCR జాతీయ స్థాయిలో BJP, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలపై UP ఫలితాలు ప్రభావం చూపడం ఖాయమంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో దూకుడుమీద ఉన్న BJP..ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉంది. TRSకు తామే ప్రత్యామ్నాయమని.. వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనంటూ ఇప్పటికే ఊదరగొడుతున్నారు తెలంగాణ నేతలు. అందుకు అనుగుణంగా పార్టీ అధిష్ఠానం కూడా తెలంగాణపై ఫోకస్‌ పెంచినట్లు తెలుస్తోంది. నార్త్‌ ఇండియాలో తిరుగులేని శక్తిగా ఎదిగిన BJP సౌత్‌ ఇండియాలో మాత్రం పాగా వేయలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణ, APపై ఫోకస్‌ పెట్టినట్లు సమాచారం. చూడాలి మరి తెలుగు రాష్ట్రాల్లో BJP ఏమేరకు రాణిస్తుందో..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu