Khushboo: సినీనటి ఖుష్బూపై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కనిమొళి

మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పారు డీఎంకే సీనియర్‌ నాయకురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోదరి కనిమొళి.

Khushboo: సినీనటి ఖుష్బూపై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు.. బహిరంగ క్షమాపణలు చెప్పిన కనిమొళి
Sadik, Khushboo
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2022 | 1:04 PM

ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూపై డీఎంకే నేత సైదైయ్ సాదిక్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు బీజేపీకి చెందిన ఖుష్బూ, నమిత, గౌతమి, గాయత్రీ రఘురామన్‌లు ఐటమ్స్‌ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఖుష్బూ పెద్ద ఐటమ్ అంటూ సాదిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే అమిత్‌షాను ఉద్దేశించి సాదిక్‌ చేసిన వ్యాఖ్యలు కూడా కమలం నాథులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. కాగా తనపై డీఎమ్‌కే నేత చేసిన వ్యాఖ్యలపై ఖుష్బూ స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ట్విట్టర్ వేదికగా ‘మహిళలను పురుషులు దుర్భాషలాడారంటే.. వారు ఎలాంటి వాతావరణంలో పుట్టిపెరిగారో ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటివారే మహిళల గర్భాన్ని అవమానిస్తారు. ఇదేనా ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలో విరాజిల్లుతున్న ద్రవిడ సంస్కృతి’ అని సాదిక్‌ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మహిళలను కించపరుస్తూ తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పారు డీఎంకే సీనియర్‌ నాయకురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోదరి కనిమొళి. తమ నాయకుడు స్టాలిన్‌ కానీ, పార్టీ అధిష్టానం కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకేసుకురాదని సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

కాగా తన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవ్వడంతో సాదిక్ కూడా క్షమాపణలు చెప్పారు. ఎవరినీ బాధ పెట్టాలన్న ఉద్దేశం తనకు లేదని, ఖుష్బూపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని సాదిక్ తెలిపారు. కాగా సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగిన నమిత, ఖుష్బూ, గౌతమి, గాయత్రి రఘురామన్‌లు ఇప్పుడూ బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా మారారు. ఇలా నటిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన నేతలను టార్గెట్‌ చేస్తూ సాదిక్‌ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!