AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరె ఏంట్రా ఇది.. ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా కూడా చేసుకోవచ్చా.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..

భారతీయ వివాహాలు రోజుల తరబడి జరిగే గొప్ప వేడుక. పెళ్లంటే రెండు జీవితాలు మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు ఏకం కావడం. అందుకే వివాహానికి అధిక ప్రాధాన్యత ఉంది. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకునే పద్ధతిలోనూ..

అరె ఏంట్రా ఇది.. ప్రీ వెడ్డింగ్ షూట్ ఇలా కూడా చేసుకోవచ్చా.. వీడియో చూస్తే మైండ్ బ్లాంక్..
Pre Wedding Shoot
Ganesh Mudavath
|

Updated on: Oct 28, 2022 | 1:04 PM

Share

భారతీయ వివాహాలు రోజుల తరబడి జరిగే గొప్ప వేడుక. పెళ్లంటే రెండు జీవితాలు మాత్రమే కాదు.. రెండు కుటుంబాలు ఏకం కావడం. అందుకే వివాహానికి అధిక ప్రాధాన్యత ఉంది. అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకునే పద్ధతిలోనూ విశేష మార్పులు వస్తున్నాయి. ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి. తమ పెళ్లి డిఫరెంట్ గా మిగిలిపోవాలనే ఉద్దేశ్యంతో నూతన వధూవరులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాయి. సముద్ర తీర ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాలు, పూల తోటలు.. ఇలా తమకు నచ్చిన ప్రదేశాల్లో ఫొటో షూట్ నిర్వహిస్తుంటారు. కొందరు వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు ఇష్టపడితే మరికొందరు మాత్రం ప్రత్యేకమైన థీమ్‌లను ఎంచుకుంటారు. ఇటీవల ఒక జంట తమ ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్‌లో భాగంగా చేసిన బైక్ స్టంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో నవ వధూవరులు బైక్‌పై కూర్చొని ఉండటాన్ని చూడవచ్చు. వాహనాన్ని క్రేన్ కు తాడుతో కట్టారు. ఫొటోగ్రాఫర్ షాట్ తీయగానే క్రేన్ బైక్‌ను జీపు మీదుగా ఎత్తడాన్ని గమనించవచ్చు. ఈ షూట్ క్లిప్‌ను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది “ప్రీ వెడ్డింగ్ షూట్స్ – నేను దీన్ని పొందుతున్నాను” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశారు. వెరైటీ కోసం ప్రాణాల్ని పణంగా పెడుతున్నారని, ఈ స్టంట్ కు రోహిత్ శెట్టి దర్శకుడా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
నాగ వంశీ నుంచి దిల్ రాజు చేతికి..? వీడియో
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
రికార్డులు తిరగరాసిన రైతు బిడ్డ.. ఇప్పుడేం చేస్తున్నాడు?
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'
'షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..'