DK Shivakumar: కార్యకర్త చెంప చెల్లుమనిపించిన కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌.. వైరలవుతోన్న వీడియో

కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కోపమొచ్చింది. మాండ్యలో ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన డీకే.. ఓ కార్యకర్త చెంప చెళ్లుమన్పించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న....

DK Shivakumar: కార్యకర్త చెంప చెల్లుమనిపించిన కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌.. వైరలవుతోన్న వీడియో
Dk Shivkumar Slaps
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 10, 2021 | 3:58 PM

కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కోపమొచ్చింది. మాండ్యలో ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన డీకే.. ఓ కార్యకర్త చెంప చెళ్లుమన్పించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత మద్దెగౌడను డీకే శివకుమార్‌ పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. తన భుజం మీద ఆ కార్యకర్త చెయ్యి వేసి ఫోటో తీసుకునేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు డీకే శివకుమార్‌. హద్దుమీరి ప్రవర్తించాడని , తనకు కనీస మర్యాద ఇవ్వలేదని ఆ కార్యకర్తపై మండిపడ్డాడు డీకే శివకుమార్‌. కార్యకర్తను డీకే చెంప మీద కొట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కార్యకర్తలంటే డీకే శివకుమార్‌కు చాలా చులకన అని విమర్శించారు బీజేపీ నేతలు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉండి.. ఇలా ప్రవర్తించడమని అనర్హమని పేర్కొన్నారు. శివకుమార్ ఇలాంటి ప్రవర్తనను వదులుకోలేకపోతే ప్రజా జీవితాన్ని వదులుకోవాలని బీజేపీ సూచించింది. అయితే భౌతికదూరం పాటించకపోవడంతోనే కార్యకర్తను మందలించినట్టు వివరించారు డీకే శివకుమార్‌. సదరు వీడియోను సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ చేయవద్దని కోరారు. అయితే నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కొనసాగిస్తున్నారు. కాగా గతంలో కూడా తనతో సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించిన కార్యకర్తల ఫోన్లను విసిరికొట్టారు శివకుమార్.

వీడియో..

Also Read:  మోహన్ బాబుపై సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు..

అసెంబ్లీ సీట్ల పెంపు వివాదం.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే