AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam attack: అంతా 10 నిమిషాల్లోనే.. ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుపుతున్న వీడియో

అంతా 10 నిమిషాల్లోనే జరిగిపోయింది. కెమెరాలు, విదేశీ గన్స్‌తో ఉగ్రవాదుల పక్కా ప్లాన్ వేసి ఎటాక్‌ చేశారు. పహల్గామ్‌ కాల్పుల ఘటనను భద్రతా బలగాలు పరిశీలించాయి. ఉగ్రవాదులు ఏ విధంగా చొరబడ్డారు? ఏ రకంగా కాల్పులు జరిపారనే విషయంలో ఓ క్లారిటీకి వచ్చారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే 3ప్రాంతాలను ఎంపిక చేసుకుని 10 నిమిషాల్లోనే కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. 70 బుల్లెట్లు ఫైర్ చేసినట్టు తెలుస్తోంది.

Pahalgam attack: అంతా 10 నిమిషాల్లోనే.. ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుపుతున్న వీడియో
Pahalgam Terror Attack
Ram Naramaneni
|

Updated on: Apr 24, 2025 | 4:03 PM

Share

కాల్పులు జరిపిన స్థలానికి అతి సమీపంలో ఉన్న అడవుల్లోంచి పర్యాటక ప్రాంతాల్లోకి ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. విదేశీ గన్స్‌తో పాటు.. కాల్పుల ఘటనను రికార్డ్ చేసేందుకు బాడీ కెమెరాలు ధరించారని తేల్చాయి. పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్న 3 స్పాట్‌లను ఎంచుకుని.. ఆరుగురు ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరిపినట్టు అంచనాకు వచ్చాయి.

ఏప్రిల్ 22న మధ్యాహ్నం 1.50 గంటలకు ఫస్ట్ బుల్లెట్ ఫైర్ చేశారు. ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫాంలో ఉండటంతో.. తమ దగ్గరకు వచ్చే వరకు వారిని గుర్తించలేకపోయారు పర్యాటకులు. దాడులు జరిగే సమయంలో చిన్నారులు ఆడుకుంటుంటే… పెద్దలు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. అతి సమీపం నుంచి నేరుగా పర్యాటకుల తలలపైనే గురి పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపారు.

కాల్పులు జరిగిన 40 నిమిషాల తర్వాత పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి రవాణా సదుపాయం సరిగ్గా లేకపోవడంతో పోలీసులు రావడానికి ఆలస్యం అయింది. 5 కిలోమీటర్లు కేవలం కాలి నడక, గుర్రాల ద్వారా మాత్రమే అక్కడికి చేరుకోగలరు. మధ్యాహ్నం 3 గంటలకు స్పాట్‌కు చేరిన పోలీసులు సహాయకచర్యలు మొదలు పెట్టారు. పోలీసులు మరికాస్త ముందుగా వచ్చి ఉంటే కొందరి ప్రాణాలైనా కాపాడేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో 25 మంది పర్యాటకులు, ఒక టూర్ ఆపరేటర్ మరణించినట్లు భద్రతా బలగాలు ధృవీకరించాయి. ఫైరింగ్ తర్వాత ఎటువైపు నుంచి వచ్చారో అటువైపుగానే టెర్రరిస్టులు వెళ్లిపోయినట్టు గుర్తించారు.

ఉగ్రవాదుల ఫైరింగ్ వీడియో దిగువన చూడండి… 

దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ