Ram Mandir: అయోధ్య రామమందిర ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై.. కేంద్రమంత్రి తీవ్ర విమర్శలు..
దేశానికే మకుటాయ మానంగా నిర్మించిన అయోధ్య రామమందిరంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. యావత్ దేశం గర్వించదగ్గ నిర్మాణాన్ని చేపట్టింది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కమిటీ. అయితే దీనిపై కాంగ్రెస్ అనేక రాజకీయ విమర్శలు చేస్తోందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు.

దేశానికే మకుటాయ మానంగా నిర్మించిన అయోధ్య రామమందిరంపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది. యావత్ దేశం గర్వించదగ్గ నిర్మాణాన్ని చేపట్టింది శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కమిటీ. అయితే దీనిపై కాంగ్రెస్ అనేక రాజకీయ విమర్శలు చేస్తోందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. శ్రీరాముడిని ఊహాజనితంగా భావించే కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు శ్రీరాముని ఆలయ నిర్మాణాన్ని ఎలా అంగీకరిస్తారని విమర్శించారు. అయితే అయోధ్యలో నిర్మించిన శ్రీరాముని ఆలయానికి జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి వేల మంది ప్రముఖులు హాజరుకానున్నారు. ఇప్పటికే చాలమందికి ప్రత్యేక ఆహ్వాన పత్రాలు అందాయి.
దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో పాటు పలువురికి ఆహ్వాన పత్రం అందింది. అయితే అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన మహోత్సవానికి రావడంలేదని బుధవారం సాయంత్రం కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ తరుణంలో బీజేపీతోపాటు సొంత పార్టీ నేతల నుంచే భిన్నాభిప్రాయాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
శ్రీ రామమందిర నిర్మాణానికి అడ్డంకులు సృష్టించడంలో ఏమాత్రం ఆలోచించని కాంగ్రెస్ ఈ మహోత్తర సందర్భాన్ని ఎలా ఇష్టపడుతుంది? అని విమర్శించారు. ప్రాణ ప్రతిష్ఠకు రావాలన్న ఆహ్వానాన్ని తిరస్కరించడం ద్వారా శ్రీరాముడితో పాటు శ్రీరామ మందిరం పట్ల కాంగ్రెస్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రత్యక్ష సాక్షిగా నిలవడం అనేది ప్రతి భారతీయుకి గొప్ప అదృష్టం అని చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ నేతలు బుజ్జగింపు రాజకీయాల కోసం ప్రజల మనోభావాలను పక్కనపెట్టడం దురదృష్టకరమన్నారు. మోడీ-బీజేపీని వ్యతిరేకిస్తూనే, కాంగ్రెస్ దేశాన్ని కూడా వ్యతిరేకించడం ప్రారంభించిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే శ్రీరాముడిని కూడా వ్యతిరేకించడం ప్రారంభించిందని ట్వీట్ చేశారు.
प्रभु श्रीराम को काल्पनिक बताने वाली कांग्रेस और उसके नेता प्रभु श्रीराम का भव्य मंदिर भला कैसे स्वीकार कर पाएंगे?
जिसने श्रीराम मंदिर की राह में बाधा बनने में कोई कसर नहीं छोड़ी, उस कांग्रेस को भला यह भव्य अवसर कैसे अच्छा लगेगा? प्राण-प्रतिष्ठा के आयोजन का निमंत्रण ठुकरा कर…
— Dharmendra Pradhan (@dpradhanbjp) January 10, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..