AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: అలా చేస్తే అప్రజాస్వామికం అవుతుంది.. ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఉచిత హామీలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కానీ.. సంక్షేమ పథకాలు పేదలకు ఆసరాగా నిలుస్తాయని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

Supreme Court: అలా చేస్తే అప్రజాస్వామికం అవుతుంది.. ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
Supreme Court
Shaik Madar Saheb
|

Updated on: Aug 12, 2022 | 7:05 AM

Share

Supreme Court on Freebies: ఎన్నికల వేళ అధికారం కోసం రాజకీయ పార్టీలు ప్రజలకు ఇచ్చే ఉచిత హామీలను వ్యతిరేకిస్తూ బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడం అప్రజాస్వామికం అవుతుందని పేర్కొంది. అదే సందర్భంలో ఉచిత హామీలకు, సంక్షేమ పథకాలకు తేడా ఉందని స్పష్టం చేసింది. ఉచిత హామీలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కానీ.. సంక్షేమ పథకాలు పేదలకు ఆసరాగా నిలుస్తాయని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఉచిత హామీలు ఇచ్చాయని రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయలేమని, దీనిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రాల మీద 15 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయన్నారు పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు. ఉచిత హామీలను కట్టడి చేయాలి. దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలిపేందుకు నిపుణుల కమిటీని నియమించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఉచితాలు, ప్రజా సంక్షేమం వేరని.. అయితే, ప్రజల సంక్షేమం, ఆర్థిక పరిస్థితులపై సమతుల్యత ఉండేలా చూసుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రయాపడింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేశారు.

మరోవైపు, పేదలకు ఉచిత పథకాలను రద్దు చేసేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు. స్వతంత్ర భారతంలో తొలిసారి కేంద్రం దివాలా తీసింది. సామాన్యుడు వాడే ప్రతి వస్తువుపై ట్యాక్స్‌ వేశారు. ఉపాథి హామీ పథకం నిధుల్లో కోత విధించారు అని కేజ్రీవాల్‌ విమర్శించారు. రైతులు, ఉద్యోగులు, సైనికులకు ఇవ్వడానికి కేంద్రం దగ్గర డబ్బులు లేవన్నారు.

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో కేజ్రీవాల్‌ ఇస్తున్న హామీలను మోదీ పరోక్షంగా విమర్శించిన సంగతి తెలిసిందే. కొన్ని పార్టీలు పెట్రోల్‌, డీజిల్‌ కూడా ఫ్రీగా ఇస్తామని నమ్మిస్తాయన్నారు మోదీ. దాంతో కేజ్రీవాల్‌ రియాక్ట్‌ అయ్యారు. గుజరాత్‌లో 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌, మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయలు వంటి హామీలను కేజ్రీవాల్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి