AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Condom Advertisement: రచ్చ లేపిన కండోమ్ యాడ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

సాంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా భారతదేశాన్ని చెప్పుకుంటాం.. అటువంటి దేశంలో సెక్స్, లైంగిక సంబంధ అంశాలు వ్యక్తిగతమే.. వాటిగురించి బహిరంగంగానూ చర్చించబోము. కాని దేశ రాజధానిలో ఇటీవల వెలుగు చూసిన ఓ ప్రకటన రచ్చ లేపింది.

Condom Advertisement: రచ్చ లేపిన కండోమ్ యాడ్.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Condom Ad
Amarnadh Daneti
|

Updated on: Aug 12, 2022 | 7:27 AM

Share

Condom Advertisement: సాంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లుగా భారతదేశాన్ని చెప్పుకుంటాం.. అటువంటి దేశంలో సెక్స్, లైంగిక సంబంధ అంశాలు వ్యక్తిగతమే.. వాటిగురించి బహిరంగంగానూ చర్చించబోము. కాని దేశ రాజధానిలో ఇటీవల వెలుగు చూసిన ఓ ప్రకటన రచ్చ లేపింది. ఢిల్లీ మెట్రో రైల్ లోని ప్రయాణీకులు కూర్చునే సీట్లపై ఉండే ప్యానల్స్ పై ఓ కండోమ్ సంస్థకు చెందిన యాడ్ లు వెలుగుచూశాయి. అది కూడా మెట్రో రైలులో మహిళల కోసం ప్రత్యేకంగా రిజర్వు చేయబడిన సీట్ల వద్ద కండోమ్ యాడ్ లు వెలుగుచూడటంతో ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా మెట్రో రైలులో కండోమ్ యాడ్ లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో నెటిజన్లు ఢిల్లీ మెట్రో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా బస్సులు, రైళ్లు, మెట్రో రైళ్లల్లో పలు కంపెనీలకు చెందిన యాడ్ లు దర్శనమిస్తుంటాయి. దీని ద్వారా ప్రభుత్వం లేదా ఆయా కార్పోరేషన్లకు ఆదాయం వస్తుంది. కాని ఆదాయం కోసం ఇలాంటి యాడ్ లు పెట్టుకోవడానికి అనుమతించడంపై అధికారుల తీరును ప్రజలు తప్పుపడుతున్నారు. తక్షణమే ఇలాంటి యాడ్ లు తొలగించాలని, మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని కోరుతున్నారు.

సోషల్ ఢిల్లీ మెట్రో రైలులో కండోమ్ యాడ్ కు సంబంధించిన ఫోటోను ఓ వ్యక్తి పోస్టు చేయడంతో ఇది వైరల్ అయింది. ఈఫోటో చూసిన మరికొంతమంది డిల్లీ మెట్రోరైలు కార్పోరేషన్- DMRC ని ట్యాగ్ చేసి ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘ఢిల్లీ మెట్రో.. మీరు పురోగతి చెందారా.. మహిళల సీట్ల వద్ద కండోమ్ యాడ్ పెట్టారా.. మీ తప్పేమీ లేదు. కానీ మీకు ఓ విషయం తెలియాలి. భారత్ ఎటువంటి దేశమంటే.. టీవీలో మధ్యాహ్నం సమయంలో కండోమ్ యాడ్స్ రావొద్దనే నిబంధనలు ఉన్నాయి. ఒకసారి దృష్టిసారించండి అంటూ కండోమ్ యాడ్ ఫోటోను పోస్టు చేశాడు. మరికొంతమంది అయితే ఇందులో పెద్ద తప్పేమీ కనిపించడంలేదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అధికారులు స్పందిచారు. ఆయాడ్ చాలా కాలం నాటిదని.. ఇప్పుడు అక్కడ లేదని.. ఎప్పుడో తొలగించామని సమాధానమిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..