Delhi pollution: ఢిల్లీలో వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉన్నట్టు కేజ్రీవాల్ సర్కార్ అఫిడవిట్!
దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ సందర్భంగా తాము లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉన్నట్టు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఢిల్లీ సర్కార్.
Supreme Court on Delhi pollution: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ సందర్భంగా తాము లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉన్నట్టు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది ఢిల్లీ సర్కార్. అయితే, కాలుష్య నియంత్రణకు ప్రభుత్వానికి మూడు మార్గాలను సూచించింది సుప్రీం కోర్టు.
క్రాకర్స్ కాల్చడం, పంట దగ్ధం సహా పలు కారణాలతో దేశ రాజధానిలో ఎయిర్ పొల్యూషన్ డేంజర్ లెవెల్స్‌ను కూడా క్రాస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నగరాల్లో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది ఢిల్లీ. దీంతో ప్రమాదకర స్థాయిని దాటి పెరిగిపోయిన కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అవసరమైతే రెండ్రోజులు లాక్‌డౌన్ అంశాన్ని పరిశీలించాలని సూచించింది.
ఈ నేపథ్యంలో తాము లాక్‌డౌన్‌కు సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అయితే, పొరుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్ విధిస్తేనే..ఫలితం ఉంటుందని కోర్టుకు తెలిపింది.ఢిల్లీ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో, “స్థానిక వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి పూర్తి లాక్‌డౌన్ వంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది” అని పేర్కొంది. “అయితే, ఎన్‌సీఆర్ పొరుగు రాష్ట్రాల అంతటా అమలు చేస్తే అలాంటి చర్య అర్థవంతంగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడాన్ని “అత్యవసర పరిస్థితి” అని గతంలో సుప్రీంకోర్టు పేర్కొన్నది. కీలకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. “ఢిల్లీ కాంపాక్ట్ సైజు దృష్ట్యా, లాక్‌డౌన్ గాలి నాణ్యతపై పరిమిత ప్రభావాన్ని చూపుతుంది” అని అఫిడవిట్‌తో సమర్పించిన వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తన వివరణాత్మక కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది.
అలాగే, ఢిల్లీతో పాటు చట్టుపక్క ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారం రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనికి సంబంధించి కార్యాచరణ చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు కోరింది. విషపూరితంగా మారిన వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు మంగళవారం సమావేశమై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. లాక్‌డౌన్ పెడితే కొంత వరకు కాలుష్యాన్ని తగ్గించే అవకాశం ఉందని గత విచారణలో సీజే ఎన్వీ రమణ పేర్కొన్న విషయం తెలిసిందే.
మరోవైపు, ఢిల్లీకి సరిహద్దు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్‌లలో వ్యవసాయ మంటల నుండి వెలువడున్న కాలుష్యం కాస్త తగ్గడంతో ఢిల్లీలో ఆదివారం 24 గంటల సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 330 నమోదైంది. AQI శుక్రవారం దాదాపు 471 వద్ద ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు నమోదైన గాలి నాణ్యతలో ఇదే అత్యధికం. అయితే, కాలుష్యాన్ని అరికట్టేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. అదనంగా, గాలి నాణ్యత సూచికను మెరుగుపరచడానికి సగటున 500 కంటే ఎక్కువ ఉన్న ప్రస్తుత స్థాయి నుండి కనీసం 200 పాయింట్లకు తగ్గించడానికి తీసుకోవలసిన చర్యలను కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.
అంతకుముందు శనివారం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం నుండి ఢిల్లీలోని పాఠశాలలను ఒక వారం పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు . పిల్లలు కలుషితమైన గాలిని పీల్చకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం అనంతరం విలేకరులతో తెలిపారు. అటు, పొరుగున ఉన్న హర్యానా కూడా అధిక కాలుష్యం కారణంగా నాలుగు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది.
ఇదిలావుంటే, గాలి నాణ్యతను సాధారణంగా 51 నుంచి 100 మధ్య ఉన్న AQI ‘సంతృప్తికరంగా భావిస్తారు. 101-200 మధ్య నమోదైతే తీవ్ర కాలుష్యంగా నిర్ణయిస్తారు. 201-300 ఎక్కువ ప్రమాదకారి కేటగిరీ కిందకు వస్తుంది. 300-400 ‘అత్యంత ప్రమాదకరంగా పరిగణిస్తారు, ఇక, 401-500 మధ్య స్థాయిల్లో AQI నమోదైతే ‘ప్రమాదకర’ కేటగిరీగా భావిస్తారు. ఎన్‌సీఆర్ పరిసర ప్రాంతాలలో వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) ఆదివారం నాడు గాలి నాణ్యతకు దోహదపడే ఐదు వేర్వేరు ప్రాంతాలను గుర్తించింది. వరి పొట్టు దహనం, నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాలతో దుమ్ము, రోడ్లు, బహిరంగ ప్రదేశాల నుండి దుమ్ము; వాహనాలు, పరిశ్రమల నుంచి భారీ ఎత్తున గాలి నాణ్యత తగ్గడానికి కారణమవుతుందని, దీంతో దేశ రాజధాని ఢిల్లీ పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నట్లు కమిషన్ నిర్ధారించింది.
Read Also… Corona Children: బాల్యం బరువెక్కింది.. చిన్నారులపై కరోనా ప్రభావం.. సర్వేలో షాకింగ్ విషయాలు..