Cabinet Groups: సీనియర్ మంత్రుల నేతృత్వంలో గ్రూపులుగా కేంద్ర మంత్రులు.. ప్రధాని మోడీ కీలక నిర్ణయం.. ఎందుకంటే..
కేంద్ర మంత్రివర్గం ప్రభుత్వ పనుల్లో వేగం పెంచే దిశలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో సరికొత్త అడుగులు వేస్తోంది. గ్రూపులుగా మంత్రులు విడిపోయి కలివిడిగా పనిచేయనున్నారు.
Cabinet Groups: కేంద్ర మంత్రివర్గం ప్రభుత్వ పనుల్లో వేగం పెంచే దిశలో ప్రధాని మోడీ ఆధ్వర్యంలో సరికొత్త అడుగులు వేస్తోంది. ఇటీవల 3 నెలల్లో 5 సార్లు మంత్రుల బృందం సమావేశాలు నిర్వహించగా, ఇప్పుడు ప్రభుత్వ పనుల్లో వేగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మొత్తం 77 మంది మంత్రులను 8 గ్రూపులుగా విభజించింది. ఈ గ్రూపుల్లో ఒక సీనియర్ మంత్రి మొత్తం గ్రూపునకు అధిపతిగా వ్యవహరిస్తారు. దీంతో పాటు ఇద్దరు కొత్త మంత్రులు, మరికొందరు పాత మంత్రులు, మరికొందరు రాష్ట్ర మంత్రులు ఈ గ్రూపులో ఉంటారు. కొత్త విధానంలో, మంత్రులు ఇప్పుడు తమ సిబ్బందిలో నైపుణ్యం కలిగిన వ్యక్తుల ఎంపిక వంటి విషయాల్లో తమలో తాము సమన్వయం చేసుకుంటారు. ఏదైనా సాంకేతిక సమస్యపై నిపుణుల అభిప్రాయం లేదా సబ్జెక్ట్‌పై మెరుగైన అవగాహన పొందడానికి పరస్పర సూచనలు, పనిలో సాంకేతికతను ఉపయోగించడం వంటి విషయాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకుని మెరుగైన పనితీరు కోసం ప్రయత్నిస్తారు..
వాస్తవానికి, ప్రతి సమూహాన్ని సమన్వయం చేయడం.. ఆలోచనలను పరస్పరం మార్చుకోవడం ద్వారా ప్రభుత్వ పనిని నాణ్యతగా.. నిర్వహించడమే దీని వెనుక ఉద్దేశ్యం. పనిలో మరింత పారదర్శకత తీసుకురావడానికి, ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడానికి మంత్రులను గ్రూపులుగా విభజించాలని ప్రధాని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.
ఒక మంత్రిత్వ శాఖ పనితీరుకు సంబంధించిన సమాచారం మరో మంత్రిత్వ శాఖకు కూడా అందుబాటులో..
మొత్తం 77 మంది మంత్రులను 8 గ్రూపులుగా విభజించడం వెనుక రెండో ఉద్దేశం.. తొలిసారి ప్రభుత్వంలో పనిచేసే అవకాశం వచ్చిన కొత్త మంత్రులకు సమయం వృథా చేయకుండా ప్రభుత్వ విధానాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం కల్పించడమే. ప్రభుత్వ విధానాలు తెలియక పోవడం వాళ్ళ కొన్నిసార్లు వారు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.అంతేకాకుండా అధికారుల నుంచి మార్గదర్శకత్వం అవసరం అవుతుంది.
ఇప్పుడు ఈ కొత్త మార్గంలో, ఒక మంత్రిత్వ శాఖ పనికి సంబంధించిన సమాచారం మరొక మంత్రిత్వ శాఖకు కూడా అందుబాటులో ఉంటుంది.ఉమ్మడిగా ఉండే సమస్యలను వెంటనే పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది. ప్రధాని నిరంతరం కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ మంత్రులకు, మంత్రిత్వ శాఖకు మధ్య సామరస్యం ఆవశ్యకతను ఎప్పటికప్పుడు నొక్కిచెబుతున్నారు. ఆ కోవలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి: Corona Vaccine: కోవిషీల్డ్ డోసుల మధ్య గ్యాప్ పెంచాల్సిన అవసరం లేదు.. స్పష్టం చేసిన నిపుణులు!