Delhi: యువతా బీ అలర్ట్.. మెట్రోలో ఇకనుంచి అలాంటి పనులు చేశారో అంతే సంగతలు..

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు, యువతీ యువకులు, పెద్దవారు అనే తేడా లేకుండా అందరూ వీడియో షేరింగ్ యాప్స్‌గా బాగా అలవాటు పడ్డారు. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలోకి వదిలేస్తున్నారు.

Delhi: యువతా బీ అలర్ట్.. మెట్రోలో ఇకనుంచి అలాంటి పనులు చేశారో అంతే సంగతలు..
Metrorail
Follow us

|

Updated on: Mar 14, 2023 | 1:35 PM

ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు, యువతీ యువకులు, పెద్దవారు అనే తేడా లేకుండా అందరూ వీడియో షేరింగ్ యాప్స్‌గా బాగా అలవాటు పడ్డారు. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలోకి వదిలేస్తున్నారు. చుట్టూ జనాలు ఉన్నారనేది లేదు.. తాము బస్సులో, కారులో, ట్రైన్, ఆఖరికి విమానంలో ఉన్నా సరే రీల్స్ చేసి సోషల్ మీడియాలోకి వదిలేస్తున్నారు. వీరి రచ్చ అయితే మెట్రో రైళ్లలో మరింత ఎక్కువగా ఉంటుంది. మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ కొందరు అవేవీ పట్టించుకోకుండా డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ కూడా అయ్యాయి.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్లలో రీల్స్ చేయడం, డ్యాన్స్ చేయడం వంటి వాటిని నిషేధించింది. మెట్రో లోపల వీడియోలు తీస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెట్టొద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్.

ఇవి కూడా చదవండి

‘ప్రయాణించండి.. ఇతరులకు ఇబ్బంది కలిగించొద్దు’ అంటూ డీఎంఆర్‌సీ ట్వీట్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..