AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 4th Wave: ముంచుకొస్తున్న ఫోర్త్ వేవ్ ముప్పు.. అక్కడ మాస్క్ మస్ట్.. లేకుంటే భారీగా ఫైన్

Covid-19 4th Wave in India: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటంతో.. నిపుణులు ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

Covid-19 4th Wave: ముంచుకొస్తున్న ఫోర్త్ వేవ్ ముప్పు.. అక్కడ మాస్క్ మస్ట్.. లేకుంటే భారీగా ఫైన్
Mask
Shaik Madar Saheb
|

Updated on: Apr 20, 2022 | 1:45 PM

Share

Covid-19 4th Wave in India: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటంతో.. నిపుణులు ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కేసులు (Coronavirus) పెరుగుతున్న రాష్ట్రాల్లో చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఢిల్లీ, గురుగ్రాం, నోయిడా తదితర ప్రాంతాలతోపాటు ముంబైలో కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీలో కోవిడ్ కట్టడి కోసం డీడీఎంఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేస్తు ఉత్తర్వులిచ్చింది. మాస్క్‌ (mask compulsory)లు ధరించని వారిపై రూ. 500 జరిమానా విధించాలంటూ డీడీఎంఏ ఆదేశాలిచ్చింది. దీంతోపాటు పాఠశాలలు, కళాశాలలను కొనసాగించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డిడిఎంఎ) బుధవారం ఆదేశాలిచ్చింది.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధ్యక్షతన జరిగిన సమావేశం తరువాత.. అథారిటీ రాజధాని ఢిల్లీలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించనున్నట్లు డీడీఎంఏ ప్రకటించింది. ఢిల్లీలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున దృష్ట్యా DDMA సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకుముందు మంగళవారం ఢిల్లీలో కొత్తగా 632 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని.. దీంతోపాటు మరణాలు కూడా తక్కువేనని ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నప్పటికీ కోవిడ్ పరిస్థితి ఆందోళనకరంగా లేదని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య తక్కువగా ఉందని, ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని ఆయన చెప్పారు.

కాగా.. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. సరిహద్దుల్లోని జిల్లాలో పొరుగు రాష్ట్రాలు కూడా మాస్క్‌ను తప్పనిసరి చేశాయి. కోవిడ్ -19 ఫోర్త్ వేవ్ భయం మధ్య ఉత్తరప్రదేశ్, హర్యానా ప్రభుత్వాలు సోమవారం సరిహద్దు జిల్లాలలో మాస్క్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చాయి.

Also Read:

India Covid News: అలర్ట్.. దేశంలో మళ్లీ 2 వేల మార్క్ దాటిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు..

Anakapalle: పుష్ప.. కత్తి పట్టక ముందు.. కాబోయే వరుడితో సెల్ఫీ.. ఫొటో వైరల్