India Covid News: అలర్ట్.. దేశంలో మళ్లీ 2 వేల మార్క్ దాటిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు..
India Coronavirus Updates: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. దాదాపు వెయ్యికి అటు ఇటుగా నమోదవుతున్న కేసులు
India Coronavirus Updates: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ థర్డ్ వేవ్ అనంతరం కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గింది. దాదాపు వెయ్యికి అటు ఇటుగా నమోదవుతున్న కేసులు మళ్లీ.. రెండు వేల మార్క్ దాటాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా పెరిగింది. సోమవారం తగ్గిన కరోనా (Covid-19) కేసులు.. మంగళవారం మళ్లీ రెండు వేల మార్క్ దాటాయి. ముఖ్యంగా ఢిల్లీ, యూపీ, హర్యానా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో (మంగళవారం) దేశంలో 2,067 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 40 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కాగా.. బుధవారం డైలీ పాజిటివిటీ రేటు 0.49%కి పెరిగగా.. వీక్లీ పాజిటివ్ శాతం 0.34% నుంచి 0.38%కి పెరిగింది.
-
- తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మొత్తం కేసుల సంఖ్య 4,30,47,594 కి చేరింది.
- కరోనా నాటి నుంచి ఇప్పటివరకు మరణాల సంఖ్య 52,2006 కి పెరిగింది.
- ప్రస్తుతం దేశంలో 12,340 (0.03 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- నిన్న కరోనా నుంచి 1547 మంది కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,25,13,248 కి చేరింది. రికవరీ రేటు 98.76 శాతం ఉంది.
- ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,86.90 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.
- దేశంలో నిన్న 4,21,183 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి 83.29 కోట్ల పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది.
అయితే.. మంగళవారం దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గిన తరువాత మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం 2,183 కేసులు నమోదు కాగా.. మంగళవారం 1,247 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మరణాలు కూడా ఒకటే నమోదైంది.
Also Read: