Mother-Son Suicide Case: రగులుతున్న రామాయంపేట.. పోలీసుల అదుపులో నిందితులు.. పత్తాలేని సీఐ..!
Ramayampet Mother-Son Suicide Case: కామరెడ్డిలోని (Kamareddy) రామాయంపేట రగులుతోంది. తల్లీకొడుకులు పద్మ, సంతోష్ ఆత్మహత్య మంటలు చల్లారడం లేదు. నిందితులను అరెస్టు చేయాలంటూ బీజేపీ సహా విపక్షాలు రోడెక్కాయి.
Ramayampet Mother-Son Suicide Case: కామరెడ్డిలోని (Kamareddy) రామాయంపేట రగులుతోంది. తల్లీకొడుకులు పద్మ, సంతోష్ ఆత్మహత్య మంటలు చల్లారడం లేదు. నిందితులను అరెస్టు చేయాలంటూ బీజేపీ సహా విపక్షాలు రోడెక్కాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని పిలుపునిచ్చాయి. అటు బీజేపీ లీగల్ సెల్ సభ్యులు రామాయంపేట వెళ్లి ఘటనపై ఆరా తీయనున్నారు. ఇక ఈ ఇష్యూపై బీజేపీ నేతల బృందం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ఇవాళ రామాయంపేట, ఖమ్మం బంద్‌లపై బీజేపీ ఆందోళనలో నేపథ్యంలో అక్కడ భారీగా బలగాలు మోహరించారు. రామాయంపేట తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో ఆరుగురు నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మున్సిపల్ చైర్మన్ జితేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరితో పాటు మరో నలుగురు కామారెడ్డి టౌన్ సీఐ ముందు లొంగిపోయారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సీఐ నాగార్జున గౌడ్ ఎక్కడనేది మిస్టరీగా మారింది. మరోవైపు అటు లొంగిపోయిన నిందితులను కామారెడ్డి పోలీసులు వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించనున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత..కోర్టులో సరెండర్ చేయనున్నట్లు సమాచారం.
మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన తల్లి పద్మ, ఆమె కొడుకు సంతోష్.. కామారెడ్డిలోని లాడ్జ్‌లో రూమ్ తీసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు. తల్లి, కొడుకు ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టడంతో వైరల్‌గా మారింది. తమ ఆత్మహత్యకు ఏడుగురు కారణమని మృతులు సూసైడ్ నోటులో పేర్కొన్నారు. తాము చనిపోవడానికి రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వేధింపులే కారణమని ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్‌తో కలిసి అప్పటి రామాయంపేట సీఐ నాగార్జున గౌడ్ వేధించాడని సంతోష్ సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశాడు. తన వ్యాపారం జరగకుండా చేశాయడంతో తాను అర్థికంగా నష్టపోయి అప్పులు చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read: