Crime News: 24 గంటలూ ఫోన్‌తోనే.. తండ్రి రీఛార్జ్ చేయించలేదని కన్న కొడుకు ఏం చేశాడంటే..?

Phone addiction: ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. మొబైల్ ఫోన్లతో ఎప్పుడూ కూడా బిజీగా ఉంటూ.. అది లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేని

Crime News: 24 గంటలూ ఫోన్‌తోనే.. తండ్రి రీఛార్జ్ చేయించలేదని కన్న కొడుకు ఏం చేశాడంటే..?
Smart Phones
Follow us

|

Updated on: Apr 20, 2022 | 8:08 AM

Phone addiction: ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. మొబైల్ ఫోన్లతో ఎప్పుడూ కూడా బిజీగా ఉంటూ.. అది లేకుండా ఒక్క క్షణం కూడా గడపలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. తాజాగా ఫోన్ కు బానిసైన ఓ బాలుడు తండ్రి తన మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేయించలేదనే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. జబల్పూర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు నిఖిల్ నాలుగు నెలల క్రితం తల్లిని కోల్పోయాడు. దీంతో తండ్రి, కొడుకు ఇద్దరూ కలిసి నివసిస్తున్నారు. తండ్రి రోజు కూలీ పని చేస్తూ నిఖిల్ ను చూసుకునే వాడు. అయితే.. ఆయన పనికి వెళ్లిన తర్వాత నిఖిల్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ మొబైల్‌తోనే రోజంతా గడిపేవాడు. ఇటీవల నిఖిల్ మొబైల్‌లో ఇంటర్నెట్ ప్యాక్ వ్యాలిడిటీ అయిపోయింది. దీంతో మొబైల్ రీఛార్జ్ చేయించాలంటూ తండ్రిని అడిగాడు. అయితే.. డబ్బులు లేకపోవడంతో నిఖిల్ తండ్రి రీఛార్జ్ చేయించలేకపోయాడు. తండ్రి తన మొబైల్ ఫోన్ డేటా ప్యాక్‌ను రీఛార్జ్ చేయలేదన్న కారణంగా 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మూడు రోజులుగా ఫోన్‌లో ఇంటర్నెట్ పనిచేయకపోవడంతో నిఖిల్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన నిఖిల్.. తండ్రి తన మొబైల్ ఫోన్ డేటా ప్యాక్‌ను రీఛార్జ్ చేయించలేదన్న కారణంతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP) అలోక్ శర్మ చెప్పారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అతని తండ్రి.. యువకుడి మొబైల్ ఫోన్ డేటా ప్యాక్‌ను రీఛార్జ్ చేయించలేకపోయాడని ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. యువకుడు మొబైల్ ఫోన్‌లో గేమ్స్ కు అలవాటు పడ్డాడని తేలిందని సీఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

Crime News: పిల్లల ఎదుటే భార్యను చంపిన దుర్మార్గుడు.. అశ్లీల వీడియోలో ఉంది ఆమెనన్న అనుమానంతో..

Medical Seats Scam: తెలంగాణలో బయటపడిన మరో బిగ్‌ మెడికల్‌ స్కామ్‌.. ఒక్కో పీజీ సీటు ఎంతకు అమ్ముకున్నారో తెలుసా?