Anakapalle: తప్పు ఒప్పుకున్న పుష్ప.. సర్‌ప్రైజ్ అంటూ షాకిచ్చి సెంట్రల్ జైలుకెళ్లింది..

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Apr 20, 2022 | 9:41 AM

Anakapalle pushpa case: ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక కాబోయే వరుడి గొంతు కోసిన అనకాపల్లి పుష్ప ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతి నేరాన్ని ఒప్పుకుంది.

Anakapalle: తప్పు ఒప్పుకున్న పుష్ప.. సర్‌ప్రైజ్ అంటూ షాకిచ్చి సెంట్రల్ జైలుకెళ్లింది..
Bride Attack On Groom

Anakapalle pushpa case: ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక కాబోయే వరుడి గొంతు కోసిన అనకాపల్లి పుష్ప ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో యువతి నేరాన్ని ఒప్పుకుంది. పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకే (Bride Attack On Groom) కాబోయే వరుడి గొంతు కోసినట్లు వియ్యపు పుష్ప అంగీకరించిందని అనకాపల్లి డీఎస్పీ బి.సునీల్‌ వెల్లడించారు. మంగళవారం అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల మండలం ఘాట్‌రోడ్డు జంక్షన్‌కు చెందిన అద్దెపల్లి రామునాయుడు, రావికమతం గ్రామానికి చెందిన పుష్ప (22) కు వివాహం నిశ్చయమైంది. మే 20న వివాహం జరగాల్సి ఉంది. అత్తామామల ఆహ్వానం మేరకు రామునాయుడు సోమవారం రావికమతంలో వారింటికి వెళ్లాడు. స్నేహితులకు పరిచయం చేస్తానని, ఇద్దరం కాసేపు బయట తిరిగి వద్దామంటూ పుష్ప చెప్పడంతో.. ఇద్దరూ కలిసి స్కూటీపై బయల్దేరారు. ఈ క్రమంలో వడ్డాది వద్ద ఓ ఫ్యాన్సీ దుకాణం వద్ద స్కూటీని ఆపించి.. పుష్ప కత్తి కొనుగోలు చేసింది. ఏం కొంటున్నావంటూ రాము అడగ్గా గిఫ్ట్ అంటూ అతనికి చెప్పింది.

ఆ తర్వాత ఇద్దరూ కోమళ్లపూడి శివారులోని అమరపురి ఆశ్రమం వద్దకు వెళ్లారు. స్నేహితులేరంటూ రాము ప్రశ్నించగా.. కేక్‌ తీసుకురావడానికి వెళ్లారంటూ చెప్పింది. ఈ లోగా నీకో ‘సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌’ ఇస్తానంటూ రాము కళ్లకు చున్నీతో గంతలు కట్టింది. వెంటనే కత్తిని తీసి గొంతుపై పెట్టి కోసింది. రాము బలవంతంగా చున్నీ విప్పేసుకోగా.. తనకు ఈ పెళ్లి ఇష్టంలేదని అందుకే ఇలా చేశానంటూ పుష్ప విలపించింది. ఆ తర్వాత ఆమె కూడా ఏమైనా చేసుకుంటుందేమోనన్న ఆందోళనతో రామునాయుడు స్వయంగా పుష్పను స్కూటీపై ఎక్కించుకుని అక్కడ నుంచి బయలుదేరాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో కొంతదూరం వచ్చాక స్పృహ తప్పి పడిపోయాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు చూసి వారిని రావికమతం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. యువకుడికి అక్కడ ప్రథమ చికిత్స చేసి ఆ తర్వాత అనకాపల్లికి తరలించారు.

సెంట్రల్ జైలుకు పుష్ప..

ఈ ఘటన తర్వాత రావికమతంలో ఉన్న పుష్పను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఘటనాస్థలికి వెళ్లి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి మంగళవారం రాత్రి చోడవరం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి డి.ఉమాదేవి ఎదుట హాజరుపర్చినట్లు పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్‌ రిమాండ్‌ నిమిత్తం విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించిటన్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: Funny Video: అట్లుంటది మరి మనతోని.. పాపం జాగ్వార్.. చాలా ట్రై చేసింది కానీ కుదరలేదు..!

Pawan Kalyan: ఊరికే హీరో అయిపోలే.. కిందామీద పడి కష్టపడితేనే ఇలా.. పవన్ వీడియో…

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu