Husband-wife: భార్య అంటే ఇంత ప్రేమ.. భార్య చితిలో దూకిన భర్త.. ఆమె మరణం తట్టుకోలేక..!
సామాజిక దురాచారమైన సతీసహగమనం అందరికీ తెలిసిందే. అంటే భర్త మరణిస్తే అతని చితిలో భార్య దూకి ఆత్మార్పణం చేసుకోవటం. అప్పట్లో సామాజిక జాఢ్యంగా పేరుకుపోయిన దీనిని కొందరు వ్యతిరేకిస్తూ నిర్మూలించారు. అయితే తాజాగా
సామాజిక దురాచారమైన సతీసహగమనం అందరికీ తెలిసిందే. అంటే భర్త మరణిస్తే అతని చితిలో భార్య దూకి ఆత్మార్పణం చేసుకోవటం. అప్పట్లో సామాజిక జాఢ్యంగా పేరుకుపోయిన దీనిని కొందరు వ్యతిరేకిస్తూ నిర్మూలించారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. అయితే భర్త చితిలో భార్య దూకలేదు. భార్య చితిలో భర్త దూకాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మహోబా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జైత్ పుర్ గ్రామానికి చెందిన బ్రిజేష్, ఉమ దంపతులు. ఉమకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో చికిత్స చేయించుకునేందుకు 500 రూపాయలు కావాలని బ్రిజేష్‌ను అడిగింది. ఇప్పుడు లేవు, తర్వాతి రోజు ఇస్తానని చెప్పాడు. భర్త సమాధానంతో ఉమ తీవ్ర మనస్తాపానికి గురైంది. రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో గదిలో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకుంది. ఉదయం నిద్రలేచి చూసేసరికి ఉమ ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. వెంటనే ఉమను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని జైత్‌పుర్ పట్టణంలోని శ్మశానవాటికకు తరలించారు. ఇదే సమయంలో భార్య మృతితో తీవ్ర మనస్తాపానికి గురైన బ్రిజేష్ మండుతున్న భార్య చితిలోకి దూకాడు. అక్కడున్న వ్యక్తులు వెంటనే అప్రమత్తమై బ్రిజేష్ ను బయటకు లాగారు.తన భార్య చిన్న కారణానికే ఆత్మహత్యకు పాల్పడిందని.. ఆమె చనిపోయాక తనకు బతకాలని లేదంటూ బ్రిజేష్ రోధించాడు. మరోవైపు.. కట్నం కోసం భర్త, అత్తమామలే తమ కూతుర్ని హత్య చేశారని ఉమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్ రివర్స్
Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..
Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్.. వైరల్ వీడియో
Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

