ఢిల్లీలో లాక్ డౌన్ జూన్ 7 వరకు పొడిగింపు, రెండు రంగాలకే ఆంక్షల సడలింపు, ఇప్పట్లో అన్-లాక్ ప్రక్రియ లేనట్టే !

ఢిల్లీలో లాక్ డౌన్ ని జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉత్పాదక, నిర్మాణ రంగాలకు మాత్రం మినహాయింపునిచ్చింది.

ఢిల్లీలో లాక్ డౌన్ జూన్ 7 వరకు పొడిగింపు,  రెండు రంగాలకే ఆంక్షల సడలింపు, ఇప్పట్లో అన్-లాక్ ప్రక్రియ లేనట్టే !
Delhi Lockdown
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: May 30, 2021 | 7:38 AM

ఢిల్లీలో లాక్ డౌన్ ని జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉత్పాదక, నిర్మాణ రంగాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. సోమవారంతో లాక్ డౌన్ ముగియాల్సి ఉన్నప్పటికీ దీన్ని జూన్ 7 వరకు పొడిగిస్తామని, ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఉత్పాదక, నిర్మాణ రంగాలు పూర్తిగా కోవిద్ ప్రొటొకాల్స్ ని పాటించాలని, కార్మికులకు, సిబ్బందికి అధికారులు అన్ని కోవిద్ టెస్టులు నిర్వహించాలని. వర్కర్లకు వేర్వేరు షిఫ్టులను కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. నిజానికి సోమవారం నుంచి ఆంక్షలను సడలించే అవకాశాలు ఉన్నాయని కేజ్రీవాల్ సూచనప్రాయంగా చెప్పినప్పటికీ గతరాత్రి పొద్దుపోయిన అనంతరం ముందు జాగ్రత్త చర్యగా లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో నిన్న 956 కోవిద్ కేసులు నమోదు కాగా 24 గంటల్లో 122 మంది కోవిద్ రోగులు మరణించారు. పాజిటివిటీ రేటు 1.19 శాతం నమోదైంది. గత ఏప్రిల్ లో ఇది 36 శాతం ఉంది. చాలా వారాల తరువాత కోవిద్ కేసులు తగ్గాయని చెప్పిన కేజ్రీవాల్.. అత్యవసరమైతే తప్ప..ప్రజలు చాలావరకు ఇళ్లలోనుంచి బయటకురాకూడదని సలహా ఇచ్చారు. అన్-లాక్ ప్రక్రియను ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది.

ఆన్-లాక్ అన్నది కోవిడ్ కేసులను బట్టి ఉంటుందని, కేసులు పెరిగితే మళ్ళీ ఆంక్షలను విధించే విషయాన్ని యోచిస్తామని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కోవిద్ కేసులు ఇంకా చాలా తగ్గాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా వ్యాక్సిన్ కొరత తీర్చేందుకు తాము తిరిగి ఆయా వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో సంప్రదింపులు ప్రారంభించామని ఆయన చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోరాదన్నారు. కేంద్రం 24 గంటల్లోగా విదేశాల నుంచి టీకామందులను ప్రొక్యూర్ చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: రాజకీయ సంక్షోభం నడుమ….రామాలయాల నిర్మాణానికి భారీ నిధులను కేటాయించిన నేపాల్ ప్రభుత్వం , టూరిస్టులకు వీసా ఫ్రీ మినహాయింపు

Viral Video: పెంపుడు కుక్కతో నూతన వధువరులు డ్యాన్స్‌.. స్టెప్పులేసిన డాగ్‌.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!