రాజకీయ సంక్షోభం నడుమ….రామాలయాల నిర్మాణానికి భారీ నిధులను కేటాయించిన నేపాల్ ప్రభుత్వం…
రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్నప్పటికీ నేపాల్ ప్రభుత్వం దేశంలో రామాలయాల నిర్మాణానికి భారీ నిధులను కేటాయించింది.
రాజకీయ సంక్షోభంతో సతమతమవుతున్నప్పటికీ నేపాల్ ప్రభుత్వం దేశంలో రామాలయాల నిర్మాణానికి భారీ నిధులను కేటాయించింది. 35 కోట్లను ఇందుకు కేటాయించినట్టు ఆర్ధిక మంత్రి బిష్ణు పౌడ్యాల్ నిన్న ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయ మరమ్మతులు, పునరుద్ధరణకు, అయోధ్యాపురిలో కొత్త ఆలయ నిర్మాణానికి ఈ నిధులను వినియోగిస్తామని ఆయన చెప్పారు. 1647.67 బిలియన్ల భారీ బడ్జెట్ ను ప్రకటించిన ఆయన..దేశంలో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు విదేశీ పర్యాటకులకు వీసా ఫ్రీ మినహాయింపు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు, దేశీయ ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం 20 బిలియన్లను వ్యయం చేయనున్నామన్నారు. బిత్వాన్ జిల్లాలో రామాలయ నిర్మాణానికి ఖచ్చితంగా ఎన్ని నిధులను ఖర్చు పెట్టనున్నామన్న విషయాన్నీ మాత్రం ఆయన వివరించలేదు. అసలైన అయోధ్య ఇండియాలో కాదని, తమ దేశంలోనే ఉందని ఆపద్ధర్మ ప్రధాని కె.పి. శర్మ ఓలి గత జులైలో ప్రకటించి వివాదం రేపారు. దీంతో నేపాల్ లో ఇది ఒక రకంగా రాజకీయ సమస్యగా మారింది. నేపాల్ పార్లమెంటును, ప్రతినిధుల సభను ప్రెసిడెంట్ భండారీ రద్దు చేసిన నేపథ్యంలో ఇక ఎన్నికలను నిర్వహించనున్నారు. (కె.పి.శర్మ ఓలి ప్రతినిధుల సభలో జరిగిన బల పరీక్షలో ఓడిపోయిన సంగతి విదితమే.)
నవంబరు 12, 19 తేదీల్లో నేపాల్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు 63 బిలియన్లను కేటాయించినట్టు బిష్ణు పౌడ్యాల్ వెల్లడించారు. ఇప్పటికే తాము దీనిపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. నేపాల్ రాజధాని ఖాట్మండులో ఆస్పత్రులు కోవిద్ రోగులతో కిక్కిరిసి పోయి ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Anywhere Anytime: ఒక్క క్లిక్‌తో ఫోన్లో డ్రైవింగ్ లైసెన్స్ పొందండి ఇలా..!! ( వీడియో )