AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు ప్రయాణాలకు భారీగా తగ్గిన డిమాండ్..పలు రైళ్ళ సర్వీసులను రద్దు చేస్తున్న రైల్వేలు

Indian Railways: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపధ్యంలో రైలు ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. అత్యవసరం అయితే, తప్ప ప్రయాణాలకు ముందుకు రావడం లేదు.

Indian Railways: రైలు ప్రయాణాలకు భారీగా తగ్గిన డిమాండ్..పలు రైళ్ళ సర్వీసులను రద్దు చేస్తున్న రైల్వేలు
Indian Railways
KVD Varma
|

Updated on: May 30, 2021 | 7:39 AM

Share

Indian Railways: కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న నేపధ్యంలో రైలు ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉంటున్నారు. అత్యవసరం అయితే, తప్ప ప్రయాణాలకు ముందుకు రావడం లేదు. అదీకాకుండా దాదాపుగా అన్ని రాష్ట్రాలలోనూ కరోనా నియంత్రణ కోసం కఠిన చర్యలు చేపట్టడం.. చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించడంతో ప్రయాణాలకు ప్రజలు మొగ్గు చూపడం లేదు. దీంతో ప్రస్తుతం నడుస్తున్న మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ళు ఖాళీగా ఉంటున్నాయి. ఈ ఏడాది మేలో ఇప్పటివరకు 1.76 కోట్ల మంది ప్రయాణికులు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా ప్రయాణించారు. తగ్గిన డిమాండ్‌కు ప్రతిస్పందనగానే కాకుండా, అనవసరమైన ప్రయాణాన్ని నిరుత్సాహపరిచేందుకు కూడా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెగ్యులర్ రైలు సర్వీసులను తగ్గించారు. రెండవ వేవ్‌ ప్రారంభానికి ముందు వరకూ దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 1,500 రైళ్ళు నడిచేవి. క్రమేపీ రైళ్ల సంఖ్య రోజుకు 865 కు తగ్గించారు. ఇందులో “ప్రత్యేక” రైళ్లు ఉన్నాయి. కరోనా మహమ్మారి మొదట ప్రారంభం అయ్యే సమయంలో అంటే 2020 ప్రారంభంలో, ప్రతిరోజూ 1,768 సుదూర రైళ్లు నడిచాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎక్కువ మంది ప్రయాణీకుల రద్దీ తూర్పు రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్‌కు ఉంది. ఈ ట్రాఫిక్ మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చింది. ఈ సంవత్సరం స్థానికీకరించిన లాక్‌డౌన్ల కారణంగా కార్యాలయాలు మూసివేయడంతో ఆయా నగరాల్లో పనుల కోసం వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా స్వస్థలాలకు చేరుకోవడంతో ఆ ప్రాంతాల్లో రద్దీ కనిపించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ వంటి పెద్ద పారిశ్రామిక కేంద్రాల నుండి వెనక్కు ప్రయాణించాలన్న ప్రజల డిమాండ్లను ప్రత్యేక రైళ్లు తీర్చాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశాలోని తమ సొంత రాష్ట్రాలకు తిరిగి చేర్చాయి.

గత లాక్ డౌన్ పరిస్థితుల తరువాత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రయాణీకుల రద్దీ తిరిగి ప్రారంభమైంది. ఫిబ్రవరిలో 7.5 కోట్ల మంది ప్రయాణికులు సుదూర మెయిల్ / ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించారు. మార్చిలో 5.8 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. ఏప్రిల్ 1 నుండి ప్రారంభమైన ఈ ఆర్థిక సంవత్సరంలో, 2.72 కోట్ల మంది ప్రజలు, లేదా సగం మంది ప్రయాణికులు సాధారణ తరగతి దూరపు రైళ్ల ద్వారా ప్రయాణించినట్లు రైల్వే డేటా చెబుతోంది. నాన్-ఎసి స్లీపర్ క్లాస్‌లో సుమారు 1.65 కోట్ల మంది ప్రయాణించారు. రైలు సర్వీసులను మూసివేసే బదులు, ప్రత్యేక రైళ్లు, రెగ్యులర్ రైళ్లు నిరంతరం నడపడం వల్ల అత్యవసర ప్రయాణాన్ని చేపట్టాలనుకునేవారికి, లాక్డౌన్ కింద ఉన్న రాష్ట్రాల నుండి స్వస్థలాలకు తిరిగి రావడానికి సహాయపడింది.

భారతీయ రైల్వే 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 122 కోట్ల మంది ప్రయాణికులను తీసుకెళ్లింది, ఇందులో 63 లక్షల మంది వలసదారులు శ్రామిక్ స్పెషల్స్‌లో ప్రయాణించారు. సుమారు 28 కోట్లు మాత్రమే రిజర్వు చేసిన ప్రయాణికులు ఉన్నారు. సాధారణంగా ఒక సంవత్సరంలో ఈ ప్రయాణీకుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు, 2019-20లో 800 కోట్ల మంది ప్రయాణికులు సుదూర రిజర్వు చేసిన రైళ్లలో ప్రయాణించారు.

Also Read: Viral News: బ‌రాత్ రోజు బుల్లెట్ కావాల్సిందే అని​ మొండిగా ప‌ట్టుపట్టిన వ‌రుడు.. ​దిమ్మ‌తిరిగే ​షాక్​ ఇచ్చిన వధువు!

Richest Persons: అంబానీ..అదానీ..నువ్వా నేనా..! ధనవంతుల్లో అగ్రస్థానం కోసం పోటా పోటీ..వీరి ఆస్తుల విలువెంతో తెలుసా?