AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Persons: అంబానీ..అదానీ..నువ్వా నేనా..! ధనవంతుల్లో అగ్రస్థానం కోసం పోటా పోటీ..వీరి ఆస్తుల విలువెంతో తెలుసా?

Richest Persons: ఇరువురు సంపద సృష్టికర్తల మధ్య కొనసాగుతున్న ఆర్ధిక యుద్దం. ఒకరిని మించి ఒకరు సృష్టిస్తున్న ఆర్దిక సంపద రాసులు. ఈపాటికి మీకు వారెవరో అర్ధం అయిపోయి ఉండాలి.

Richest Persons: అంబానీ..అదానీ..నువ్వా నేనా..! ధనవంతుల్లో అగ్రస్థానం కోసం పోటా పోటీ..వీరి ఆస్తుల విలువెంతో తెలుసా?
Richest Persons
KVD Varma
|

Updated on: May 29, 2021 | 9:55 PM

Share

Richest Persons: ఇరువురు సంపద సృష్టికర్తల మధ్య కొనసాగుతున్న ఆర్ధిక యుద్దం. ఒకరిని మించి ఒకరు సృష్టిస్తున్న ఆర్దిక సంపద రాసులు. ఈపాటికి మీకు వారెవరో అర్ధం అయిపోయి ఉండాలి. అవును.. వారే ఒకరు ముఖేష్‌ అంబానీ మరొకరు గౌతమ్‌ శాంతిలాల్‌ అదానీ. ప్రపంచ కుబేరులలో మొదటి రెండు స్ధానాలు దక్కించుకున్న మన భారత మాత ముద్దు ధనికులు. ఒక వైపు కరోనా మహమ్మారితో ప్రజలు ఆస్తులు కరిగిపోతుంటే మరోవైపు ఈ ఇద్దరి సంపద రాసులు మాత్రం గుట్టలు గుట్టలుగా పెరుగుతున్నాయి.

తాజాగా బ్లూమ్ బ‌ర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ద‌క్షిణాసియా కుబేరుల్లో ముఖేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. రిలెయన్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అబానీ ప్ర‌థ‌మ స్థానం. రెండ‌వ స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌత‌మ్ అదానీ నిలిచారు. చైనా బిలియనీర్ జోంగ్ షాన్షాన్‌ను అధిగమించి..ఆసియాలో రెండవ ధనవంతుడిగా గౌతమ్‌ అదానీ స్థానం సంపాదించారు. షాన్షాన్ సంపాదన 65.6 బిలియన్ డాలర్లు కాగా…అదానీ గ్రూప్ నికర విలువ 5 66.5 బిలియన్లు అని బ్లూమ్ బ‌ర్గ్ బిలియనీర్ ఇండెక్స్ సూచించింది. ముఖేష్‌ అంబానీకి గౌతమ్‌ అదానీ చెక్‌ చెబుతున్నారు. తాజాగా గౌతమ్‌ అదానీ సంపద 67.6 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో ఇది రూ. 5 లక్షల కోట్లు. దేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడిగా గౌతమ్ అదానీ ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ఆస్తి 76.3 బిలియన్ డాలర్లు అంటే, మన కరెన్సీలో దాదాపు రూ.5.50 లక్షల కోట్లు. ప్రస్తుతం వీరి మధ్య ఆర్ధిక వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు.

అయితే, గత ఏడాది ముఖేష్ అంబానీకి దరిదాపుల్లో కూడా గౌతమ్‌ అదానీ లేరు. ప్రస్తుతం అదానీ సంపాదన గంటకు రూ.75 కోట్లు. ఈ ఏడాది ప్రతి గంటకు రూ.75 కోట్లకు గౌతమ్ అదానీ సంపద పెరిగింది. అదానీ గ్రూప్‌కు చెందిన 6 లిస్టెడ్ కంపెనీల్లో .. గత ఏడాది పదివేల రూపాయల పెట్టుబడి పెట్టి ఉంటె అది ఇప్పుడు 52,000 వేల రూపాయల రిటర్న్స్ అందిస్తుందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

గౌతమ్ అదానీ సంపద వేగంగా పెరగడానికి ఇన్‌ఫ్రాపై ఎక్కువగా పెట్టుబడులే కారణం గా చెబుతున్నారు. గ్యాస్ పంపిణీ, పవర్, ఓడరేవులు, విద్యుత్ పంపిణీ రంగాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది అదానీ గ్రూప్. అదానీ గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ గత ఏడాది రూ.1.64 లక్షల కోట్లు కాగా..ప్రస్తుతం 420 శాతం పెరిగి రూ.8.5 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాదిగా అత్యల్పంగా విలువ పెరిగిన కంపెనీ అదానీ పోర్ట్స్…అత్యధికంగా పెరిగిన కంపెనీ అదనీ టోటల్ గ్యాస్. 144 శాతం పెరిగిన అదానీ పోర్ట్స్ విలువ..అదేసమయంలో 1069 శాతం పెరిగిన అదానీ టోటల్ గ్యాస్ వ్యాల్యూ. ఇక ఇతర అదానీ కంపెనీల విషయానికి వస్తే..అదానీ ఎంటర్‌ప్రైజెస్ 842 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 715 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 442 శాతం, 176 శాతం మార్కెట్ వ్యాల్యూను పెంచుకున్నాయి. మొత్తమ్మీద 420 శాతం అదానీకి చెందిన ఆరు కంపెనీల మార్కెట్‌ వ్యాల్యూ పెరిగింది.

Also Read: ఈ నోటు మీ దగ్గర ఉందా ? అయితే ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అయినట్టే.. ఏ నోటుకు ఎంత విలువ ఉందంటే..

Hundred Rupee Note :100 రూపాయల నోటును పది రెట్ల ధరకు అమ్మవచ్చు..! అవును మీరు విన్నది నిజమే..? ఎలాగో తెలుసుకోండి..