నల్లటి ట్రాలీ బ్యాగులో కుకీలు, బియ్యం ప్యాకెట్లు.. తీరా చూసి కస్టమ్స్ అధికారుల షాక్!
రూ. 11 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడాకు చెందిన 20 ఏళ్ల మహిళను సోమవారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజిఐ) విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఫిబ్రవరి 21న బ్యాంకాక్ నుండి వచ్చిన మహిళ సాధారణ తనిఖీల సమయంలో కస్టమ్స్ శాఖ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె లగేజీని పరిశీలించిన అధికారులు, ఆకుపచ్చ రంగు మాదకద్రవ్య పదార్థాన్ని గుర్తించారు.

డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా విషయంలో కస్టమ్స్ శాఖ పెద్ద విజయం సాధించింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోట్లాది రూపాయల విలువైన గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుకీలు, బియ్యం ప్యాకెట్లలో దాచిపెట్టిన నల్లటి ట్రాలీ బ్యాగులో అక్రమంగా తరలిస్తున్న అనుమానిత ఆకుపచ్చ రంగు మాదకద్రవ్యాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా రూ. 11 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నోయిడాకు చెందిన 20 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు.
ప్రొఫైలింగ్ ఆధారంగా కస్టమ్స్ విభాగం సిబ్బంది ఈ ప్రయాణీకురాలిని తనిఖీ చేసింది. ఆ ప్రయాణీకురాలు బ్యాంకాక్ నుండి ఢిల్లీ టెర్మినల్ -3 వద్ద TG-323 అనే విమానంలో దిగారు. విమానాశ్రయంలో, ఆమె గ్రీన్ ఛానల్ ద్వారా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగును ఎక్స్-రే తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో, ఒక నల్లటి ట్రాలీ బ్యాగ్‌లో ఎనిమిది ప్యాకెట్ల కుకీలు, బియ్యం దొరికాయి. అందులో ఆకుపచ్చ రంగులో అనుమానిత మాదకద్రవ్య పదార్థం ఉంది. దీని మొత్తం బరువు 11,284 గ్రాములు. స్వాధీనం చేసుకున్న పదార్థం ప్రాథమిక దర్యాప్తులో అది డ్రగ్స్ అని నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ. 11.28 కోట్లు ఉంటుందని అంచనా. అరెస్టు చేసిన మహిళపై నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టం కింద చట్టపరమైన చర్యలుల తీసుకునేందుకు సిద్ధమవుతున్నవారు.
ఇటీవల, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కస్టమ్స్ బృందం రెండు పెద్ద కొకైన్ అక్రమ రవాణా కేసులను బయటపెట్టింది. కస్టమ్స్ బృందం ఒక మహిళతో సహా ఇద్దరు విదేశీ మాదకద్రవ్యాల స్మగ్లర్లను అరెస్టు చేసింది. దాదాపు రూ.28 కోట్ల విలువైన 1,862 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది. జనవరి 24న, కస్టమ్స్ ఇంటెలిజెన్స్ బృందం ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద గ్రీన్ ఛానల్ దాటి ఎగ్జిట్ గేట్ వైపు వెళుతుండగా మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్నాడని అనుమానంతో కెన్యా జాతీయుడిని అరెస్టు చేసింది. అతని అనుమానాస్పద ప్రవర్తన ఆధారంగా, కస్టమ్స్ బృందం అతన్ని క్షుణ్ణంగా దర్యాప్తు కోసం తీసుకెళ్లింది. ఆ తర్వాత, అతను కొకైన్ నిండిన పెద్ద మొత్తంలో గుళికలను అక్రమంగా రవాణా చేసినట్లు ఒప్పుకున్నాడు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




